మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) , స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కలయికలో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) రూపొందుతుంది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘రైడ్’ రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇన్కమ్ టాక్స్ రైడ్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఒరిజినల్ నుండి సోల్ మాత్రమే తీసుకుని.. పూర్తిగా దర్శకుడు హరీష్ శంకర్ శైలిలో ఈ సినిమా కథనం ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ‘సితార్’ అనే పాట రిలీజ్ అయ్యి సినిమాపై బజ్ ఏర్పడేలా చేసింది.
మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని రూ.70 కోట్ల బడ్జెట్ లో నిర్మించాలని మేకర్స్ రంగంలోకి దిగారట. కానీ ఇప్పుడు బడ్జెట్ శృతిమించినట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘మిస్టర్ బచ్చన్’ కి రూ.90 కోట్లు బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది.
రవితేజ- హరీష్ శంకర్..లది హిట్టు కాంబినేషన్. కాబట్టి.. ఓటీటీ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ నుండి రూ.45 కోట్ల వరకు రికవరీ సాదించిందట. ఆడియో రైట్స్ కూడా రూ.4 కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ.30 కోట్ల వరకు జరుగుతున్నట్టు వినికిడి. ఓవర్సీస్ బిజినెస్ కూడా జరగలేదు. నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉంది.
సో అటు ఇటుగా ఇప్పుడు రూ.80 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు స్పష్టమవుతుంది. థియేట్రికల్ నుండి ఇంకాస్త ఎక్కువ వస్తే ప్రాఫిట్స్ వస్తాయి. అది మౌత్ టాక్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది. అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయకపోవడం వల్ల.. మైనస్ రూ.10 కోట్లతో రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది.