Rama Rao On Duty: ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ నుండి రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎస్‌ ఎల్‌ వి సినిమాస్’ మరియు ‘ఆర్‌టి టీమ్‌ వర్క్స్’ బ్యానర్ ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రవితేజ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి సిఐ మురళి అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. జూలై 29న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

టీజర్ లో యాక్షన్ పార్ట్ ను మాత్రమే చూపించారు. కానీ ట్రైలర్లో కథలోని లోతును చూపించారు.2 నిమిషాల 15 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ట్రైలర్ విషయానికి వస్తే.. వివిధ గ్రామాల నుండి చాలా మంది అదృశ్యమైన టైంలో , ఆ ప్రాంతానికి తహశీల్దార్‌గా ఉన్న రవితేజ ఆ కేసును తీసుకుంటాడు. పోలీసులు పట్టించుకోని ఆ కేసుని రవితేజ ఎలా సాల్వ్ చేసాడు ఈ నేపథ్యంలో ఎదురైన పరిస్థితులు ఏంటి అనే పాయింట్ తో సినిమా రూపొందినట్లు స్పష్టమవుతుంది.

ట్రైలర్‌లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ఇలా అన్నిటికీ పెద్ద పీట వేశారు.1995 నేపథ్యంలో జరిగే కథ ఇదని స్పష్టమవుతుంది. సత్యన్ సూర్యన్ ISC కెమెరా పనితనం ప్రశంసనీయంగా ఉంది.’ఖైదీ’ ఫేమ్ సామ్ CS అందించిన BGM కూడా ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది అని చెప్పొచ్చు.ఈ మూవీతో రవితేజ హిట్ అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆ అవకాశాన్ని ఎంత వరకు వాడుకుంటాడో చూడాలి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!


రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus