‘మిస్టర్ బచ్చన్’ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్లో 75వ సినిమాగా అంటే ల్యాండ్ మార్క్ మూవీగా ‘మాస్ జాతర’ రూపొందుతుంది. భాను భోగవరపు అనే నూతన దర్శకుడికి రవితేజ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాపైనే రవితేజ దాదాపు ఏడాది కాలంగా ఉండిపోయాడు. సాధారణంగా రవితేజ ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటూ ఉంటాడు.
కానీ వరుస ప్లాపులు, పైగా ల్యాండ్ మార్క్ మూవీ కావడం వల్ల కొంచెం కేర్ తీసుకుని ‘మాస్ జాతర’ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. జూలై 18నే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆగస్టు 27 కి వాయిదా వేశారు.
వాస్తవానికి ఆగస్టు 27 చాలా మంచి డేట్. ఎందుకంటే ఆ రోజు వినాయక చవితి హాలిడే ఉంది. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. వీకెండ్ మొత్తం క్యాష్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ డేట్ కి కూడా ‘మాస్ జాతర’ రాకపోవచ్చు అనే టాక్ ఊపందుకుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో యూనిట్ సభ్యులు చేస్తున్న సమ్మె వల్ల ‘మాస్ జాతర’ ఫైనల్ కాపీ రెడీ అయ్యే అవకాశం కనిపించడం లేదు.
దీనిపై నిర్మాత నాగవంశీ ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరోపక్క డబ్బింగ్ సినిమా అయిన ‘వార్ 2’ గురించి అతను చేసిన హడావిడి చూసి.. రవితేజ ఫ్యాన్స్ రగిలిపోతూ అతనిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినా వాళ్ళు కొంచెం కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. బహుశా కొత్త రిలీజ్ డేట్ కోసం పరిశీలిస్తూ.. రవితేజ ఫ్యాన్స్ ను వెయిట్ చేయిస్తున్నాడేమో.