Pawan Kalyan: ఆ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం సరైనదే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతమంది దర్శకులు ఉన్నా విలక్షణ దర్శకుడు తేజకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్‌కు తన సినిమాలతో ఎందరో నటీనటులను పరిచయం చేసిన తేజ ప్ర‌స్తుతం నిర్మాత సురేష్‌బాబు రెండో కుమారుడు అభిరామ్‌ను తెలుగు తెర‌కు హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. అభిరామ్ తో అహింస అనే సినిమా చేశాడు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ల‌లో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న దర్శకుడు తేజ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఇదే సమయంలో (Pawan Kalyan) పవన్ కళ్యాణ్- తేజ కాంబోలో ఆగిపోయిన సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ తో ఎప్పటినుంచో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడట తేజ‌. అదే సమయంలో ఆయన కోసం తన కెరీర్ లోనే ఎప్పుడు ఏ హీరోకి రాయని… ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ రాసి మరి పవర్ స్టార్ ఇంటికి వెళ్లి ఆ స్టోరీ చెప్పాడ‌ట‌. కథ మొత్తం విన్నాక పవన్ కళ్యాణ్ నాకు స్టోరీ నచ్చలేదంటూ మొహం మీదే చెప్పేసాడ‌ట ప‌వ‌న్‌.

ఇక తర్వాత దర్శకుడు తేజ అదే కథతో మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసి భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ తేజ పవన్ కళ్యాణ్‌తో చేయాలనుకున్న సినిమా ఏంటే.. నిజం.. సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లోనే డిజాస్టర్ సినిమా నిజంను ముందుగా పవన్ కళ్యాణ్ తో చేయాలని భావించారట తేజ. ఆ సినిమా స్టోరీ వినగానే బాగోదని ముందుగానే ఆలోచించిన పవన్ ఈ భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు.

కానీ మహేష్ బాబు మాత్రం తేజ చేతిలో బుక్ అయిపోయాడు. పైగా ఒక్క‌డు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి నిజం ప్లాప్ అయ్యింది. అలా పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన డిజాస్టర్ మహేష్‌తో చేసి తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు తేజ‌. ఇక చాలా రోజుల త‌ర్వాత తేజ రానా హీరోగా వ‌చ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టాడు. మ‌రి అహింస సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌స్తాడేమో ? చూద్దాం.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus