సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ ఎంతో మంది నటీమణులు.. వారు ఎదుర్కొన్న చేదు సంఘటనలు గురించి చెప్పుకొచ్చారు. ఇక అటు తరువాత తను శ్రీ దత్తా స్థాపించిన ‘మీటూ’ ఉద్యమం అయితే ఇండియా లెవెల్లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చిన్మయి, శృతీ హరిహారన్ వంటి ఎంతో మంది నటీమణులు వారు ఎదుర్కొన్న లైంగిక దాడులు గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ ఉద్యమం చాలా వరకూ చల్లారిపోయింది అనుకున్న టైములో ఎవరో ఒకరు మళ్ళీ ఈ ఉద్యమాన్ని గుర్తుచేస్తూనే ఉన్నారు.
తాజాగా తమిళ హీరోయిన్ కళ్యాణి అలియాస్ పూర్ణిత కూడా తాను ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ఆమె సినిమాలకు ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “నాకు సినిమా అవకాశాలు వచ్చే సమయంలో నిర్మాణ సంస్థల నుండీ ఫోన్లు వచ్చేవి.మేము నిర్మించే సినిమాల్లో మీరే హీరోయిన్ అని చెప్పేవారు. మంచి ఆఫర్ వచ్చింది కదా అని సంతోషపడేలోపే అడ్జెస్ట్ అవ్వాలి అంటూ చెప్పుకొచ్చింది. మొదట్లో అమ్మ అమ్మకు ‘అడ్జెస్ట్ మెంట్’ అంటే అర్థం అయ్యేది కాదు. డేట్స్ కి సంబందించిన అడ్జెస్ట్మెంట్సేమో అనుకునేది. పడక గదిలోకి పిలుస్తున్నారన్న విషయం ఆమెకి తెలిసేది కాదు.
దాంతో మా అమ్మ ఒకే చెప్పేసేది. విషయం అర్థం అయ్యాక అలాంటి ఫోన్ క్లాల్స్ ని ఇగ్నోర్ చేస్తూ వచ్చాం. బుల్లితెర పైకి వచ్చాక కూడా అలాంటి తిప్పలు తప్పలేదు. ఓ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఆ ఛానల్లో పై స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తి రాత్రికి పబ్బులో కలుసుకుందామా అని అడిగాడు. పబ్బుకి రాను. సాయంత్రం కాఫీ షాప్ కు వెళదాం అని చెప్పాను. అప్పటి నుంచి నాకు బుల్లితెరపై కూడా ఛాన్సులు కరువయ్యాయ్యాయి. దీనితో నా నటనకు స్వస్తి చెప్పేసాను” అంటూ చెప్పింది కళ్యాణి. ప్రస్తుతం కళ్యాణి వివాహం చేసుకుని లైఫ్ లో సెటిలయిన సంగతి తెలిసిందే.