Rajamouli: ఆ రీజన్ వల్లే రాజమౌళి సీనియర్స్ కు దూరమా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన సినీ కెరీర్ లో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతోనే ఎక్కువ సంఖ్యలో సినిమాలను తెరకెక్కించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో జక్కన్న సినిమాలను తెరకెక్కించలేదు. మగధీర సినిమాలో చిరంజీవి కొన్ని నిమిషాల పాటు కనిపించినా ఆ రోల్ ను గెస్ట్ రోల్ గానే పరిగణించాలి. అయితే జక్కన్న సీనియర్ హీరోలకు దూరంగా ఉండటానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. రాజమౌళి చిన్న సన్నివేశమైనా పెద్ద సన్నివేశమైనా తను అనుకున్న సన్నివేశం అనుకున్న విధంగా వచ్చేవరకు రాజీ పడరు.

Click Here To Watch NOW

తన ఊహకు అనుగుణంగా సన్నివేశం వస్తే మాత్రమే జక్కన్న తర్వాత సీన్ పై దృష్టి పెడతారు. చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీ ఎంతో అనుభవం ఉన్న హీరోలు కావడం వల్ల ఆ హీరోలను ఎక్కువ సంఖ్యలో టేక్స్ అడగడం ఏ దర్శకుడికి అయినా ఇబ్బంది అనే సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే ఆ సినిమాలో రిస్కీ షాట్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలతో రిస్కీ షాట్స్ చేయించడం కష్టం కావడంతో పాటు ఆ సమయంలో హీరోలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అని భావించి కూడా జక్కన్న సీనియర్ హీరోలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

అదే సమయంలో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో పోల్చి చూస్తే సీనియర్ హీరోలకు మార్కెట్ కూడా తక్కువనే సంగతి తెలిసిందే. ఈ కారణాలను పరిగణనలోకి తీసుకొని రాజమౌళి సీనియర్ హీరోలకు దూరంగా ఉన్నారని సమాచారం. రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లో మహేష్ హీరోగా నటించనున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా అప్ డేట్స్ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. త్వరలో జక్కన్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus