Prabhas: ప్రభాస్ అలా నడవటం వెనుక కారణమిదేనా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. అభిమానులు ఆదిపురుష్ టీజర్ రిలీజైనందుకు సంతోషిస్తుండగా అదే సమయంలో ప్రభాస్ నడిచే సమయంలో ఇబ్బంది పడటంతో ఒకింత కంగారు పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం ప్రభాస్ మోకాలికి సర్జరీ జరిగిందనే సంగతి తెలిసిందే. ఆ సమస్య వల్లే మెట్లు ఎక్కే సమయంలో ప్రభాస్ ఇబ్బంది పడుతూ నడిచారని సమాచారం.

మెట్లు ఎక్కే సమయంలో దిగే సమయంలో ప్రభాస్ ఇబ్బంది పడటంతో ప్రభాస్ హెల్త్ గురించి ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ప్రభాస్ కుటుంబ సభ్యులు ప్రభాస్ హెల్త్ గురించి స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. మరోవైపు ఆదిపురుష్ గురించి జరుగుతున్న నెగిటివ్ ప్రచారం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. అయితే గతంలో పలు సినిమాల టీజర్లు నెగిటివ్ ప్రచారంతో మొదలై ఆ తర్వాత సినిమాలు హిట్టైన సందర్భాలు ఉన్నాయి.

అందువల్ల ఆదిపురుష్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాతో పాటు సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కచ్చితంగా కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బాహుబలి సమయంలో తగిలిన గాయాలే ప్రభాస్ ను ఇప్పటికీ బాధ పెడుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వరుస సినిమాలతో రెస్ట్ లేకుండా పని చేయడం ప్రభాస్ హెల్త్ పై ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు 120 కోట్ల రూపాయల నుంచి 130 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus