రామ్ తాజా చిత్రమైన ‘రెడ్’ 13వ రోజున కూడా పర్వాలేదనిపించింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫామ్లో ఉన్న రామ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ వంటి క్రేజీ భామలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.కెరీర్ లో మొదటిసారి రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకం పై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు.’రెడ్’ సినిమాకి మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ..రామ్ కు ఉన్న క్రేజ్ వల్ల మంచి కలెక్షన్లనే నమోదుచేసింది.
విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘రెడ్’ చిత్రం 13 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం | 6.37 cr |
సీడెడ్ | 3.23 cr |
ఉత్తరాంధ్ర | 2.12 cr |
ఈస్ట్ | 1.60 cr |
వెస్ట్ | 1.61 cr |
కృష్ణా | 1.20 cr |
గుంటూరు | 1.27 cr |
నెల్లూరు | 0.96 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 18.36 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.81 cr |
ఓవర్సీస్ | 0.36 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 19.53 cr (షేర్) |
‘రెడ్’ చిత్రానికి 15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 19.53 కోట్ల షేర్ ను నమోదు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లకు 3.83 కోట్ల వరకూ లాభాలు దక్కినట్టు అయ్యింది. నిన్న రిపబ్లిక్ డే సెలవు రోజున కూడా ఈ చిత్రం 0.20 కోట్ల షేర్ ను రాబట్టింది.
Click Here To Read Movie Review
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!