NBK: బాలయ్య- గోపీచంద్ ల మూవీ..కొత్తగా ఆ టైటిల్ వచ్చి చేరింది..!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్..కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మొన్ననే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. దానికి అంతంత మాత్రమే అన్నట్లు రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఆ పోస్టర్ కూడా బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాల స్టైల్లోనే ఉంది. దాని సంగతి పక్కన పెట్టేస్తే.. నందమూరి బాలకృష్ణ 107 మూవీ గా రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సంద‌ర్భంగా టైటిల్ ను రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.దాంతో పాటు ‘ఓ చిన్న గ్లింప్స్ ను కూడా మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉంది’ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొద్దిరోజులుగా ఈ చిత్రానికి `అన్న‌గారు`, `వీర సింహారెడ్డి` అనే టైటిల్స్ ఫిక్స్ చేసినట్లు గుసగుసలు వినిపించాయి. చెప్పాలంటే ఆ టైటిల్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ చిత్రానికి `రెడ్డిగారు` టైటిల్ ను ఖరారు చేసినట్టు టాక్ నడుస్తుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే బాలకృష్ణ పుట్టినరోజు అయిన జూన్ 10 వరకు ఎదురు చూడాలి.ఒకవేళ నిజమే అయితే ఈ టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ చిత్రంలో విలన్ గా దునియా విజ‌య్ నటిస్తున్నాడు. బుర్రా సాయిమాధ‌వ్ ఈ చిత్రానికి మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు.ఆయన బాలయ్యకి పెద్ద ఫ్యాన్ కాబట్టి.. ఈ చిత్రంలో బాలయ్యతో పవర్ ఫుల్ డైలాగ్స్ పలికిస్తాడు అని అభిమానులు ఆశిస్తున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus