Regina: ఆ ఫోటోలను చూసి రెజీనా అలా ఫీలయ్యారా?

రెజీనా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన శాఖిని డాఖిని మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెజీనా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కెరీర్ తొలినాళ్లలో తనకు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారని ఆమె తెలిపారు. శివ మనసులో శృతి (ఎస్.ఎం.ఎస్) సినిమాతో హీరోయిన్ గా కెరీర్ గా మొదలుపెట్టానని రెజీనా వెల్లడించారు. అప్పట్లో అమ్మ నా సినిమాలను, సినిమాలకు సంబంధించిన డేట్స్ ను చూసుకునేవారని రెజీనా పేర్కొన్నారు.

రోల్స్ విషయంలో అమ్మతో వాదించానని షూటింగ్ లకు మాత్రం ఇబ్బంది పెట్టుకుండా నేను వెళ్లేదానినని రెజీనా చెప్పుకొచ్చారు. నాకు చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవారని అంత తక్కువ పారితోషికం ఎందుకు ఇచ్చేవారనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం కూడా లేదని ఆమె తెలిపారు. ఒక ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చిన తర్వాత నాకు అసలు విషయం అర్థమైందని ఆమె పేర్కొన్నారు. అప్పట్లో నాకు పర్సనల్ మేకప్ మేన్, హెయిర్ స్టైలిష్ట్ ఉండేవారు కాదని ఆమె చెప్పుకొచ్చారు.

ఒకరోజు నేను రేడియోకు ఇంటర్వ్యూకు ఇవ్వడానికి వెళ్లానని రేడియో ఇంటర్వ్యూ కదా అని జుట్టు సరిగ్గా తుడుచుకోకుండా వెళ్లానని రెజీనా అన్నారు. ఇంటర్వ్యూ పూర్తైన తర్వాత ఫోటోలు తీసుకుంటానని చెబితే ఓకే అన్నానని రెజీనా తెలిపారు. ఆ ఫోటోలు వెబ్ సైట్లలో వచ్చిన తర్వాతే నాకు అసలు విషయం అర్థమైందని రెజీనా చెప్పుకొచ్చారు. ఆ ఫోటోలలో నేను హీరోయిన్ లా లేనని ఆ ఫోటోల వల్ల ప్రమోషన్లకు మేకప్ లేకుండా వెళ్లకూడదని అర్థమైందని రెజీనా చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత నుంచి పారితోషికాలు, పాత్రల విషయంలో నా ముద్ర ఉండే విధంగా చూసుకున్నానని రెజీనా అన్నారు. రెజీనా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాఖిని డాఖిని సినిమాతో రెజీనా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus