Bro Movie: కానీ బ్రో ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి పండుగే..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో మన ముందుకు రాబోతున్న ఈ సినిమా కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ ప్రాంతాల్లో ప్రారంభించారు. ఇండియాలో అయితే కర్ణాటక లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా 12 వేల టిక్కెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. వీటిల్లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్ కి సంబంధించిన టికెట్స్ అవ్వడం విశేషం.

మల్టీప్లెక్స్ బుకింగ్స్ బుకింగ్స్ రేపు ప్రారంభం కానున్నాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇప్పటి వరకు అక్కడ ఈ చిత్రానికి 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈరోజే ఈ చిత్రానికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయి బుకింగ్స్ ఓపెన్ చేసారు.గురువారం సమయానికి ఓవర్సీస్ ప్రీమియర్స్ కచ్చితంగా 1 మిలియన్ మార్కుకి చేరుకుంటుంది అని అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ విడుదల తేదీ అప్పుడే వచ్చేసింది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్స్ కి కొనుగోలు చేసింది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు,అనగా సెప్టెంబర్ 2 వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు టాక్. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇండస్ట్రీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది.

ఇకపోతే ఈ సినిమాకి (Bro Movie) సంబంధించిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే, ట్రైలర్ విడుదల అయ్యే వరకు పెద్దగా అంచనాలు లేకపోయినా,ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు మొత్తం మారిపోయాయి. పవన్ కళ్యాణ్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చాలా కాలం తర్వాత బయటకి వచ్చిందని. ఈ యాంగిల్ సరిగ్గా క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ వేరే లెవెల్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus