Ahimsa Movie: ‘అహింస’ రిలీజ్ కి డేట్ సెట్ అవ్వడంలేదే!

  • November 25, 2022 / 05:47 PM IST

ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుంచి హీరోని పరిచయం చేస్తున్నప్పుడు దానికి సరైన కాంబినేషన్ తో పాటు రిలీజ్ టైం కూడా సెట్ అవ్వాలి. అప్పుడే జనాలకు రీచ్ అవ్వగలరు. అయితే దగ్గుబాటి అభిరామ్ సినిమాకి మాత్రం రిలీజ్ డేట్ సెట్ అవ్వడం లేదు. అభిరామ్ ని లాంచ్ చేస్తూ తేజ దర్శకత్వంలో రూపొందిన ‘అహింస’ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక సురేష్ బాబు టీమ్ గందరగోళంలో ఉందట. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, లిరికల్ వీడియోలను వదిలారు.

వాటికి సరైన బజ్ రానప్పటికీ.. సోషల్ మీడియాలో ‘అహింసను’ జనాల దగ్గరకు తీసుకెళ్లాయి. అక్టోబర్ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అలా జరగలేదు. ఇప్పుడు నవంబర్ కూడా అయిపోతుంది. డిసెంబర్ 23కి సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేయాలని చూస్తున్నారు. కానీ అప్పటికి రవితేజ ‘ధమాకా’, నిఖిల్ ’18 పేజెస్’ సినిమాలున్నాయి. ఈ సినిమాలకు ఒకరోజు ముందుగా విశాల్ ‘లాఠీ’ సినిమా రానుంది. అలానే రణవీర్ సింగ్ ‘సర్కస్’, కన్నడ సినిమా ‘వేద’ రిలీజ్ కాబోతున్నాయి.

ఇవి పాన్ ఇండియా సినిమాలు కావడంతో వీటి మధ్య ‘అహింస’ సినిమా నలిగిపోవడం ఖాయం. మంచి పాజిటివ్ టాక్ వస్తే తప్ప ‘అహింస’ సినిమాకి టికెట్లు తెగవు. పోనీ కాస్త ముందుగా వద్దామనుకుంటే ‘అవతార్2’ సినిమా ఉంది. దానికి పోటీగా సినిమాను రిలీజ్ చేయడమంటే రిస్క్ అనే చెప్పాలి. డిసెంబర్ 9న కూడా చాలా సినిమాలు ఉన్నాయి.

డిసెంబర్ మిస్ చేస్తే జనవరిలో సినిమాను రిలీజ్ చేయడం సాధ్యం కాదు. ఫిబ్రవరికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. సినిమాల రిలీజ్ డేట్ విషయంలో సురేష్ బాబుకి పక్కా ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు తన రెండో కొడుకు సినిమా రిలీజ్ విషయంలో మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus