Renu Desai: పవన్‌ కల్యాణ్‌ తనయుడిగా అకీరా జన్మించడం తప్పా… రేణు ప్రశ్న?

  • August 23, 2023 / 02:22 PM IST

నటుల వారసులు సినిమాల్లోకి వస్తున్నారు అంటే.. ఇన్‌స్టంట్‌గా విజయం సంగతి పక్కనపెడితే, ఇన్‌స్టంట్‌గా ఓ మాట మాత్రం వచ్చేస్తుంది. అదే ‘నెపోటిజం’. అదేదో పూర్తిగా నటన రాని నెపోకిడ్స్‌ను ఆదరించేసినట్లు వారసత్వం మీద కామెంట్స్‌ చేసేస్తుంటారు. ఇప్పుడు ‘నెపోకిడ్స్‌’ డిస్కషన్‌ ఎందుకంటే… అకీరా నందన్‌ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడనే విషయం బయటకు రావడమే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో అకీరా నందన్‌ ఉన్న ఓ ఫొటో ఇటీవల బయటకు వచ్చింది. నటనలో శిక్షణ కోసం అకీరా నార్వే వెళ్లాడనేది ఆ ఫొటో సారాంశం.

అయితే అకీరా సినిమాల ఇంట్రెస్ట్‌ గురించి గతంలో తల్లి (Renu Desai) రేణు దేశాయ్‌ కొన్ని సోషల్‌ మీడియా పోస్ట్‌లు పెట్టారు. వాటి ప్రకారం తనకు అంత ఆసక్తి లేదు అని అర్థమైంది. దీంతో ఇప్పుడు ‘ఎందుకు నటనలో శిక్షణ?’ అంటూ ప్రశ్నలు వినిపించాయి. అవి అటు తిరిగి, ఇటు తిరిగి రేణు దేశాయ్‌ వరకు వెళ్లాయి. ‘‘ఫిల్మ్ స్కూల్స్‌కు వెళ్లి వందల మంది యాక్టింగ్ కోర్సులు చేస్తారు. అయితే, స్టార్ హీరో కుమారులకు మాత్రమే హీరోగా ఎంట్రీ ఈజీగా దొరుకుతుంది.

తెరంగేట్రానికి కథ, సాంకేతిక బృందం ఈజీగా దొరుకుతాయి. ఇన్‌స్టంట్‌గా కాఫీ ఈజీగా. అసలు ఇది కరెక్టేనా?’ అని ఓ నెటిజన్‌ రేణు దేశాయ్‌ను ఉద్దేశించి కామెంట్‌ పెట్టారు. ఆ ప్రశ్నకు రేణు దేశాయ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్ కిడ్స్‌కు మీరు చెప్పిన ఔకర్యాలతోపాటు చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. అయినా తన కుమారుడు లేదా కుమార్తెకు కంపెనీ హ్యాండోవర్ చేయాలనే నిర్ణయం అంబానీ లాంటి వ్యాపారవేత్తలు తీసుకుంటారు.

ఎప్పుడు, ఎలా అనేది వారి ఇష్టం. అలానే ఎవరో బయట వ్యక్తికి రాసి ఇవ్వరు కదా! అంటూ తన ఆలోచనను వివరించే ప్రయత్నం చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో జన్మించిన పిల్లలకు ఈజీగా లాంచ్ అవుతారు. ఒకవేళ వాళ్లు ఫెయిల్ అయితే దారుణంగా విమర్శల పాలవుతారు. ట్రోల్ చేస్తారు, తల్లిదండ్రులతో కంపేర్ చేస్తూ నానా మాటలు అంటారు. అదే బయట వ్యక్తి సినిమాల్లో ప్రయత్నించి ఫెయిల్ అయితే వాళ్ల వల్ల కుటుంబ సభ్యులకు ఎలాంటి మాటలు రావు. అలాంటివాళ్లు హార్డ్‌ వర్క్‌తో సక్సెస్‌ అయితే రజనీ కాంత్, మాధురీ దీక్షిత్‌లా స్టార్‌ నటులు అవుతారు.

అందువల్ల మీ పని మీద ఫోకస్ చేయండి. మీ ప్రతిభ, హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకోండి. సరిగ్గా పని చేస్తే విజయాలు వస్తాయి. ఇలాంటి నెగిటివిటీ వల్ల ప్రయోజనం ఉండదు అని చెప్పారు రేణు దేశాయ్‌. అయినా హీరోలు, దర్శకులు, నిర్మాతల పిల్లలుగా జన్మించడం ఆ చిన్నారుల తప్పా అని రేణు దేశాయ్‌ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కుమారుడిగా జన్మించడం అకిరా నందన్ తప్పు కాదు అని చెప్పారు రేణు. అలాగే ప్రస్తుతానికి అకిరా హీరో కావాలని అనుకోవడం లేదని, భవిష్యత్ గురించి ఇప్పుడే ఊహించి చెప్పలేం అని అన్నారు రేణు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus