Renudesai: రెండో పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణం?

పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా నటి రేణు దేశాయ్ అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి జానీ వంటి సినిమాలలో నటించారు. ఇక జానీ సినిమా తర్వాత ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా పిల్లలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పవన్ కళ్యాణ్ తో మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. పవన్ కళ్యాణ్ నుంచి దూరంగా ఉన్నటువంటి ఈమె పిల్లల బాధ్యతలను చేపడుతూ ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.

చాలా రోజుల తర్వాత రేణు దేశాయ్ రవితేజ నటించినటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో ఈమె హేమలత లవణం అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను కడుపులో ఉన్నప్పుడు మా నాన్న అబ్బాయి పుడతారని చాలా హోప్స్ పెట్టుకున్నారు. కాకపోతే అమ్మాయి పుట్టేసరికి నాన్న కోపంతో మూడు రోజులపాటు నా మొహం కూడా చూడలేదని తెలియజేశారు. ఆడపిల్లలను చంపే తల్లిదండ్రులు ఉన్నారు కానీ నన్ను చంపకుండా బ్రతకనిచ్చారని అయితే నా ఆలనా పాలన అంత ఇంట్లో పనివారే చూసుకునేవారు అంటూ ఈమె తెలియజేశారు.

ఇక పెళ్లి చేసుకున్న తర్వాత పవన్ నుంచి విడాకులు తీసుకున్నాను అయితే మరోసారి పెళ్లి చేసుకోవాలని భావించాను నాకు పెళ్లి వ్యవస్థపై ఎంతో ఆసక్తి ఉంది. దీంతో మరొక వ్యక్తిని నేను నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ రెండో పెళ్లి చేసుకోలేకపోయాను. కేవలం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వారి జీవితం నాలా కాకూడదన్న ఉద్దేశంతోనే నేను పెళ్లి చేసుకోలేదని మరొక మూడు నాలుగు సంవత్సరాలలో పిల్లలిద్దరూ సెటిల్ అవుతారని అప్పుడు రెండో పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ ఈమె (Renudesai) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus