Renudesai: అకీరా సినీరంగప్రవేశం పై రేణు దేశాయ్ పాజిటివ్ కామెంట్స్ !

రేణు దేశాయ్..ఒకప్పటి హీరోయిన్ గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ప్రేక్షకులకు బాగా నోటెడ్. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నాక ఈమె ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాని నిర్మించి, డైరెక్ట్ చేసిన సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. ఆ సినిమా ప్రమోషన్స్ కోసమని సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే ఇక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులమని చెప్పుకుంటూ ఈమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.

ఆమె అకీరా ఫోటోలు షేర్ చేసిన ప్రతిసారి.. ‘మా అన్న కొడుకు’ అంటూ కామెంట్లు చేయడం రేణు దేశాయ్ కి నచ్చేది కాదు. ఒకానొక టైంలో అకీరాని హీరోని చేసే ఉద్దేశం లేదు అంటూ బాంబ్ పేల్చింది. ఆ తర్వాత చాలా సార్లు ఆమె అవే కామెంట్లు చేయడంతో అభిమానులు నిరాశచెందారు. అయితే ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేణు దేశాయ్ పాల్గొని అకీరా సినీ రంగప్రవేశం పై క్లారిటీ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ ”అకీరా సినిమాల్లోకి వస్తాను అంటే తల్లిగా (Renudesai) ఎంతో సంతోషిస్తా. ప్రతి తల్లికి తన కొడుకుని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఉంటుంది కదా. పైగా నేను, వాళ్ళ నాన్న, పెదనాన్న, కుటుంబం అంతా సినిమాల్లో ఉన్నాం. తను తెరపై కనిపిస్తే ఎలా చేస్తాడో అనే ఆసక్తి నాకు కూడా ఉంది. కానీ అది పూర్తిగా వాడి ఇష్టం. నటుడు కావాలని వాడికి అనిపించాలి. ఈ విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదు. తనకి మాత్రం మ్యూజిక్, రైటింగ్ , ప్రొడక్షన్ అంటే ఇష్టం” అంటూ క్లారిటీ ఇచ్చింది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus