మీరెవరో మర్చిపోయాను గుర్తు చేయగలరా.. స్టార్ హీరో కి షాక్ ఇచ్చిన రిపోర్టర్!

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన వస్త్రధారణతో స్టైల్ ఐకాన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణవీర్ సింగ్ కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయన ఎంత విభిన్నమైన వస్త్రధారణ కారణంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న రణవీర్ కి రిపోర్టర్ నుంచి చేదు అనుభవం ఎదురయింది.

ఒక రిపోర్టర్ రణవీర్ ఎదుటకు వచ్చి మీరు ఎవరో నాకు గుర్తులేదు కొంచెం గుర్తు చేయగలరా అంటూ హీరోకి షాక్ ఇచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే..హీరో రణవీర్ సింగ్ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈయన అబుదాబిలో సందడి చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఎఫ్ 1 రేస్ లను చూడటం కోసం వెళ్లినటువంటి ఈయన ఎప్పటిలాగే తన వస్త్రధారణతో అందరిని ఆకట్టుకున్నారు.

అక్కడ ఈ రేస్ చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటి రణబీర్ వద్దకు ప్రముఖ రిపోర్టర్ మార్టిన్ బ్రుండెల్ తన వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే మార్టిన్ రణవీర్ ను ప్రశ్నిస్తూ మీరు ఎవరో మర్చిపోయాను కొంచెం గుర్తు చేయగలరా అంటూ ప్రశ్నించారు. ఇలా రిపోర్టర్ అడిగేసరికి ఇతర హీరోలైతే కాస్త సీరియస్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు

కానీ రణవీర్ మాత్రం నేను బాలీవుడ్ నటుడుని సర్ ముంబై ఇండియా నుంచి వచ్చాను. నేను ఓ ఎంటర్టైనర్ ని అని తన గురించి చెప్పుకున్నారు. అదేవిధంగా తన వస్త్రధారణ గురించి ఆయనే కామెంట్ చేసుకొని రేపు ఉదయమే నేను ఈ దుస్తులను వెనక్కి ఇవ్వాలి అంటూ సరదాగా కామెంట్ చేశారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus