Ritika Singh: రిపోర్టర్ల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న రితికా సింగ్.. క్షమాపణలు చెప్పిన నటి!

గురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నటి రితిక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో నీవెవరో శివగంగ వంటి పలు సినిమాలలో నటించి మెప్పించారు. అయితే తాజాగా ఈమె తమిళంలో నటించిన ఇన్ కార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఓ మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ నటి రితిక సింగ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మీడియా సమావేశంలో భాగంగా రిపోర్టర్స్ అందరూ వచ్చి ఎదురు చూస్తుండగా ఈమె మాత్రం ఏకంగా మూడు గంటల పాటు ఆలస్యంగా రావడంతో రిపోర్టర్లు మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటే మీరు ఇంత ఆలస్యంగా వస్తారా అంటూ తనని ప్రశ్నించారు. ఈ విధంగా రిపోర్టర్స్ నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నటువంటి ఈమె రిపోర్టర్లకు క్షమాపణలు చెప్పారు.

తను కావాలని ఈ మీడియా సమావేశానికి ఆలస్యంగా రాలేదని మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఇంత ఆలస్యమైందని ఈమె ఆలస్యంగా రావడానికి కారణాన్ని తెలియజేయడమే కాకుండా ఆలస్యంగా వచ్చే తమ సమయాన్ని వృధా చేసినందుకు రిపోర్టర్లకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ విధంగా క్షమాపణలు చెప్పడంతో రిపోర్టర్లు కొంతమేర శాంతించి తిరిగి యధావిధిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus