Revanth, Keerthy: కెప్టెన్ కీర్తిపై అరిచిన రేవంత్..! అసలు విషయం ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచీ రేవంత్ తీరు చాలా భిన్నంగానే కనిపిస్తోంది. ప్రతి విషయంలోనూ ముందుగా రియాక్ట్ అయిపోయి , ఆ తర్వాత వాళ్ల దగ్గరకి వెళ్లి సారీ చెప్పి ప్యాచప్ చేసుకుంటున్నాడు. మొదటి వారం నుంచీ దూకుడుగానే ఉన్న స్వభావంతో దూసుకుపోతున్నాడు. అయితే, హౌస్ లో రేవంత్ అప్పుడప్పుడు అందరిపై అరవడం అనేది కామన్ గా మారిపోయింది. ఇక నామినేషన్స్ అప్పుడు కెప్టెన్ కీర్తిపై అరిచేశాడు రేవంత్. ఆదిరెడ్డి – రేవంత్ ఇద్దరూ కలిసి నామినేషన్స్ ని ఎదుర్కునేటపుడు ఆదిరెడ్డి నామినేట్ అయ్యాడు. రేవంత్ కోసం త్యాగం చేశాడు.

ఇక్కడే ఆదిరెడ్డి తన ఫ్యామిలీ గురించి చెప్పాడు. ఈవిషయం తెలిసిన తర్వాత రేవంత్ బాగా ఎమోషనల్ అయ్యాడు. చాలాసేపు అదే మూడ్ లో ఉన్నాడు రేవంత్. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ బయట ఎవరో తారాజువ్వలు కాలుస్తున్నారు. దీంతో రేవంత్ గట్టిగట్టిగా అరుస్తూ ఎవరైనా ఉన్నారా ? అంటూ వాళ్లని మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఫైమా, సూర్య కూడా రేవంత్ తో పాటుగా అరిచారు. దీంతో బిగ్ బాస్ ముగ్గురికీ వార్నింగ్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు ఎవరూ కూడా బయట విషయాలకి స్పందించకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మసలుకోండి అంటూ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో రేవంత్, ఫైమా, సూర్య ముగ్గురూ సారీ చెప్పారు. బిగ్ బాస్ కెప్టెన్ కీర్తిని కూడా హెచ్చరించాడు. ఇంటి సభ్యులు ఇంటి నియమాలు పాటించేలా చూసుకోవడం కెప్టెన్ బాధ్యత అంటూ చెప్పాడు. దీంతో కీర్తి పనిష్మెంట్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక్కడే రేవంత్ ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నాడు. మాట మాట పెరిగి ఇద్దరి మద్యలో మాటల యుద్ధం అయ్యింది. రేవంత్ ఫైర్ అయ్యాడు. కీర్తితో వాగ్వివాదానికి దిగాడు. కెప్టెన్ గా ఏది పడితే అది డెసీషన్ తీస్కోవడానికి లేదని, తర్వాత వేరేవాళ్లు కెప్టెన్ అయినపుడు కూడా దీన్ని తీస్కోవాలని అన్నాడు.

ఇక్కడే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనేసరికి కీర్తి హర్ట్ అయ్యింది. అంతేకాదు, కిచెన్ టేబుల్ పైన గట్టిగా కొట్టడాన్ని కూడా కీర్తి అబ్జక్ట్ చేసింది. ఇద్దరూ కాసేపు అరుచుకున్నారు. రేవంత్ ఆవేశం చల్లబడ్డాక వచ్చి కీర్తికి సారీ చెప్పాడు. కెప్టెన్ అయిన కీర్తి మీ మీద అరిచినందుకు మనస్పూర్తిగా సారీ చెప్తున్నా, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీస్కుంటానని చెప్పాడు. దీంతో వాతావరణం సద్దుమణిగింది. రేవంత్ తన ఆవేశాన్ని కీర్తిపై చూపించాడు.

అలాగే, కీర్తి కూడా ఎక్కడా తగ్గకుండా రేవంత్ కి మాటకి మాట చెప్పింది. ఇద్దరి మద్యలో వాదనలో కీర్తిపై అరవడం ఖచ్చితంగా రేవంత్ ది మిస్టేక్. ఎందుకంటే, బయట వ్యక్తులని పలకరించే ప్రయత్నం చేశారు రేవంత్, ఫైమా, సూర్యలు. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కీర్తి పనిష్మెంట్ ఇవ్వబోయింది. ఇది రేవంత్ కి నచ్చలేదు. అందుకే అరిచాడు. అదీ మేటర్.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus