ప్రభాస్ కులంపై వర్మ ట్వీట్స్
- May 4, 2017 / 09:27 AM ISTByFilmy Focus
ఏదో సరదాగా ట్వీట్స్ చేస్తూ, కోపం ఉంటే కామెంట్స్ చేస్తూ, ఇష్టం ఉంటే భజన చేస్తూ కాలం గడిపేస్తున్న వర్మ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎవ్వరూ టచ్ చెయ్యలేని, ఓపెన్ సీక్రెట్ ఒకటి వర్మ టూచ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇక ట్వీట్ చూసిన జనాలకు పిచ్చి ఎక్కిపోయింది. ఇంతకీ వర్మ చేసిన ట్వీట్ ఏంటి? అసలు మ్యాటర్ ఏంటి అంటే? తెలుగు సినిమా పరిశ్రమ పై కులం ప్రభావం ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్ అయినా ఇప్పటిదాకా ఏ టాప్ ఫిలిం సెలెబ్రెటీ ఈ విషయమై ఇప్పటిదాకా ఓపెన్ గా మాట్లాడలేదు. అయితే వర్మ ఏకంగా కులాన్ని పబ్లిక్ ఫోరం లో పెట్టేశాడు. ‘బాహుబలి-2’ సినిమా విడుదలై భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రభాస్ కులాన్ని ప్రస్తావిస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసాడు.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఎదిగిన వారంతా కమ్మ – కాపు సామాజిక వర్గాల అభిమానుల సపోర్ట్ తో ఎదిగిన వారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూనే, అయితే ప్రభాస్ ఇలాంటి సంకుచిత మనస్తత్వం లేకుండా తన సామాజిక వర్గ లోకల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించకుండా ‘బాహుబలి’ లాంటి భారీ ప్రాజెక్ట్ లో నటించడం వల్ల ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోయాడు అంటూ ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తుతూనే, ఇతర హీరోలపై ఇన్‌డైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు. మొత్తంగా వర్మ అందరూ టచ్ చెయ్యడానికి కూడా భయపడే ఒక ఓపెన్ సీక్రెట్ ను బయటకు తీసి రచ్చ రచ్చ చేస్తున్నాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















