RGV, Ariyana: మీమర్స్‌, అసంతృప్తులపై వర్మ సెటైర్‌ చూశారా

Ad not loaded.

రామ్‌గోపాల్‌ వర్మ ఏ పని చేసినా… సెటైర్లు వేయడానికి, మీమ్స్‌ చేయడానికి టీమ్‌ సిద్ధంగా ఉంటరు. వర్మ కూడా ఏమంత తక్కువ కాదు కదా. తన వీడియోకు తనే మీమ్స్ చేసుకొని ప్రజల మీదకు వదిలే రకం. తాజాగా అదే పని చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. వర్మ ఇటీవల ఆరియానాకు జిమ్‌లో ఇంటర్వ్యూ ఇస్తున్నట్లుగా ఓ బోల్డ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు మీమ్స్‌, కామెంట్లతో ఏకిపారేశారు. దానికి ఇప్పుడు వర్మ కౌంటర్‌ ఇచ్చారు.

హాయ్‌… ఆరియానా నాతో చేసిన ‘అరియానా బోల్డ్‌ ఆర్జీవీ’ఇంటర్వ్యూకి యూట్యూబ్‌లో మంచి స్పందన వచ్చింది. ఇంతటి స్పందన వచ్చినందకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఆ ఇంటర్వ్యూ చూసి… అసంతృప్తి చెందిన వారిని కూడా మేము ఇష్టపడతాం. అందరూ మాలాగా పరిపక్వత చెందడానికి సమయం పడుతుంది. అప్పటిదాకా మేం వెయిట్‌ చేస్తాం. ఒకవేళ పరిపక్వత చెందకపోయినా ఫర్వాలేదనుకోండి అంటూ సెటైర్‌ వేశారు వర్మ. సమాజం ఏమైపోతోంది? అంటూ మా మీద కామెంట్‌ చేసేవారికి…

చిన్న ఉచిత సలహా. జీవితంలో ‘చిల్‌’ అవటం నేర్చుకోండి. ఎప్పుడూ సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఇదే ఈ రోజు నేనిచ్చే జ్ఞాన గుళిక అంటూ తన జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేశారు వర్మ. దాంతోపాటు ‘అరియానా మిక్స్‌ ఆర్జీవీ’ అంటూ పాత ఇంటర్వ్యూకి తనదైన శైలిలో మీమ్స్‌, జోక్స్‌ యాడ్‌చేసి కొత్త వెర్షన్‌ లాంచ్‌ చేశారు. ఆ వీడియో మీరూ చూసేయండి.


విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus