Rishab Shetty: భార్యపై ప్రేమతో అలా విష్ చేసిన రిషబ్ శెట్టి.. భలే చేశారంటూ?

కాంతార సినిమాతో భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను పెంచుకున్న రిషబ్ శెట్టి కెరీర్ పరంగా మరింత ఎదిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మల్టీ టాలెంటెడ్ అయిన రిషబ్ శెట్టి కాంతార మూవీ క్లైమాక్స్ సన్నివేశాల్లో అద్బుతమైన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. క్లైమాక్స్ సీన్స్ కోసమే సినిమాను మళ్లీమళ్లీ చూసిన ఫ్యాన్స్ అయితే ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని రిషబ్ శెట్టి చాలా సందర్భాల్లో వెల్లడించారు.

అయితే భార్య పుట్టినరోజున రిషబ్ శెట్టి భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన విధానం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇన్ స్టాగ్రామ్ లో రిషబ్ శెట్టి భార్యతో కలిసి దిగిన ముఖ్యమైన ఫోటోలు, వీడియోలతో కూడిన స్పెషల్ వీడియోను పంచుకోవడంతో పాటు హ్యాపీ బర్త్ డే ప్రగతి అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆనందం ఒక వరంలా ఉండాలని ఈ బంధం చిరస్థాయిగా నిలిచిపోవాలని పేర్కొన్నారు.

మీ ఆయురారోగ్యాలు, మీ ప్రేమ ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయంటూ రిషబ్ శెట్టి పోస్ట్ చేశారు. భార్యపై ప్రేమతో రిషబ్ శెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన విధానం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రిషబ్ శెట్టి చేసిన ఈ పోస్ట్ కు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. భార్యపై రిషబ్ శెట్టి ప్రేమను వ్యక్తం చేసిన విధానానికి ఫిదా అవుతున్నామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

రిషబ్ శెట్టి షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా రిషబ్ శెట్టి ప్రగతి శెట్టి క్యూట్ కపుల్ అని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రిషబ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రగతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టి కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రిషబ్ శెట్టి (Rishab Shetty)  ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus