ఇటీవల గోవాలో జరిగిన IFFI వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ ….‘కాంతార’ సినిమా గురించి, రిషబ్(Rishab Shetty) నటన గురించి కొన్ని వెటకారపు కామెంట్లు చేశాడు. సినిమాలో రిషబ్ శెట్టికి పూనకం వచ్చినప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ని వెటకారంగా ఇమిటేట్ చేశాడు. అలాగే ‘కాంతార 3’లో కనుక తనను చూడాలనుకునే అభిమానులు ఉంటే రిషబ్ శెట్టి ఇక్కడే ఉన్నాడు. అతన్ని నిలదీయండి అంటూ రణ్వీర్ సింగ్ కామెంట్స్ చేశాడు.
ఇది కన్నడ ప్రేక్షకులకు కోపం తెప్పించింది. ‘కాంతార’ లో పంజుర్లీ దేవత సన్నివేశాలు హైలెట్ అయ్యాయి. అలాంటి సన్నివేశాలను వక్రీకరిస్తూ.. హాస్యాస్పదంగా రణ్వీర్ కామెంట్స్ చేయడం వాళ్ళకి తట్టుకోలేకపోయారు. తర్వాత రణ్వీర్ ఈ విషయంపై స్పందించి క్షమాపణలు తెలుపడం కూడా జరిగింది. ‘రిషబ్ కష్టాన్ని చూపించాలనే తాపత్రయం తప్ప ఎవరి సంప్రదాయాలను కించపరచడం అనేది తన ఉద్దేశం కాదని, మన దేశంలో ఉన్న అన్ని సంప్రదాయాలను గౌరవిస్తానని’ చెప్పి కన్నడ జనాలకు, రిషబ్ శెట్టికి క్షమాపణలు తెలిపాడు రణ్వీర్.

తాజాగా ఈ ఇష్యూ గురించి రిషబ్ శెట్టి స్పందించడం జరిగింది. అతను మాట్లాడుతూ.. “రణ్వీర్ సింగ్ అలా ఇమిటేట్ చేయడం నాకు కూడా ఇబ్బంది అనిపించింది. దైవత్వం నిండిన సినిమా అది. ఆ సినిమాతో మా కన్నడ ప్రజలకి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అందుకే నేను ఎక్కడికి వెళ్లినా.. ఈ సినిమాల్లో సన్నివేశలను వేదికలపై ఇమిటేట్ చేయకూడదు అని అందరికీ చెబుతూ ఉంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. రిషబ్ శెట్టి ఇలా చెప్పడం మంచిదే.
ఎందుకంటే.. అతను రణ్వీర్ కామెంట్స్ కి ఫీలవ్వలేదు అని చెబితే.. కనుక కన్నడ ప్రజల కోపాన్ని ఫేస్ చేయాల్సి వచ్చేది.
