‘ఓజి'(OG) దర్శకుడు సుజిత్ కి పవన్ కళ్యాణ్ ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ అనే కారుని పవన్ కళ్యాణ్.. సుజీత్ కి బహుకరించారు. ఈ విషయాన్ని దర్శకుడు సుజిత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
‘చిన్నప్పటి నుండి నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని. ఈరోజు ఆయన చేతులు మీదుగా గిఫ్ట్ అందుకున్నాను. నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా ఓజి పవన్ కళ్యాణ్ గారి ప్రేమ, ఆయన ఎంకరేజ్మెంట్ మరువలేనిది. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు సుజీత్. అలాగే పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా కార్ కీ అందుకుంటున్న ఫోటోలను కూడా జత చేశాడు.

ఇక ఈ కారు ధర కోటిన్నర ఉంటుందని అంచనా.పవన్ కళ్యాణ్ తో ‘ఓజి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు సుజీత్. ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్.. సుజీత్ పనితనానికి ఇంప్రెస్ అయిపోయారు.సుజీత్ కి ఉన్న డైరెక్షన్ టీం కనుక తనకు ఉండుంటే.. రాజకీయాల్లోకి వెళ్లకుండా సినిమాలు చేసుకునేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సక్సెస్ మీట్లో చెప్పడం జరిగింది.

‘ఓజి’ లో ‘జానీ’ సినిమా రిఫరెన్స్ కూడా వాడాడు సుజీత్. పవన్ కళ్యాణ్ ‘జానీ’ సినిమాని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అది డిజాస్టర్ అయ్యింది. కానీ ‘ ‘జానీ’తో సెపరేట్ ఎమోషన్ ఉంది’ అంటూ సుజిత్ చెప్పడం జరిగింది. ఈ రకంగా పవన్ కళ్యాణ్ ని అతను బాగా ఇంప్రెస్ చేశారని అర్ధం చేసుకోవచ్చు.
