అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉంటుంది. ఎంత కాదనుకున్నా ఈ సంస్థ నుండి ఏడాదికి 5,6 సినిమాలు వస్తుంటాయి. అంటే రెండు నెలలకు ఒక సినిమా అనమాట. అలాగే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది ఈ సంస్థ. కంటెంట్ ఉన్న సినిమాలను కమిషన్ లేదా రెంట్ల బేసిస్ మీద రిలీజ్ చేస్తుంటుంది. చాలా చిన్న సినిమాలకు, డబ్బింగ్ సినిమాలకి ‘మైత్రి’ సంస్థ అండగా నిలబడుతుంది. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే డబ్బింగ్ సినిమాని గత నెలలో రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టింది ‘మైత్రి’.
ఇలా నెలకోసారి ఆడియన్స్ ను ‘మైత్రి’ ఎంటర్టైన్ చేస్తూనే ఉంది అనాలి. అయితే ‘మైత్రి’ తో కొన్ని నిర్మాణ సంస్థలకి పడదు అనే గాసిప్స్ కూడా నిత్యం వినిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ‘హారిక అండ్ హాసిని’ కి ‘మైత్రి’ కి పడదు అంటారు. అలాగే దిల్ రాజుకి (Dil Raju) , ‘మైత్రి’ వారికి కూడా పడదంటారు. సినిమాల రిలీజ్ డేట్స్, అప్డేట్స్ వంటి వాటితో వీరి మధ్య వైరం నిజమే అనే సంకేతాలు కూడా అందుతుంటాయి. ఉదాహరణకి చూసుకుంటే.. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) కనుక లేట్ అయితే ఈ ఏడాది మార్చి 28 కి రిలీజ్ చేయాలని అనుకున్నారు.
కానీ హీరో తొందర పెట్టడం వల్ల ఆ సినిమాని డిసెంబర్లోనే రిలీజ్ చేశారు. అయితే మార్చి 28 కి ‘రాబిన్ హుడ్’ ని (Robinhood) ఫిక్స్ తెస్తున్నారు. మరోపక్క మార్చి 28 డేట్ ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘కింగ్డమ్’ (Kingdom) కోసం లాక్ చేసుకున్నారు. అయితే ఆ సినిమా మే నెలకు వాయిదా పడటంతో ఆ డేట్ కి ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) ని తీసుకొస్తున్నారు. వాస్తవానికి మార్చి 29న ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత ఒక రోజు ముందుకి మార్చారు.అలా ‘రాబిన్ హుడ్’ వర్సెస్ ‘మ్యాడ్ స్క్వేర్’ అయ్యింది.
సితార సినిమాలు అంటే కచ్చితంగా దిల్ రాజు రిలీజ్ చేస్తుంటారు. అందుకే ఇప్పుడు ‘మైత్రి’ కి వారి నుండి పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. అందుకోసమే ‘రాబిన్ హుడ్’ ప్రమోషన్స్ డోస్ పెంచారు. కానీ ‘మ్యాడ్ స్క్వేర్’ టీం ప్రమోషన్స్ స్లోగానే ఉన్నాయి. మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయి? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఉగాది టైంకి టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి… మంచి టాక్ తెచ్చుకుంటే ఈ రెండు సినిమాలకు బుకింగ్స్ బాగుంటాయి. ప్రస్తుతానికైతే ప్రమోషన్స్ విషయంలో ‘రాబిన్ హుడ్’ పై చేయి సాధిస్తుంది అని చెప్పాలి.