ఎన్టీయార్ ఎదుగుదలను అడ్డుకొంటున్నారంటూ రోజా రచ్చ!
- March 29, 2016 / 01:13 PM ISTByFilmy Focus
జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ అధినేత చంద్రబాబు వాడుకుని వదిలేశారనే విమర్శ ఉంది. ఇప్పడు ఇదే అంశం పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరింత ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని, ఆ తర్వాత టీడీపీలో కార్యకర్తగా కూడా ఉండనివ్వకుండా తరిమేశారని, జూనియర్ ఎన్టీఆర్ తెలివితేటల ముందు తన కొడుకు లోకేశ్ ఎదగలేడన్న భయంతో.. చంద్రబాబు, ఎన్టీఆర్‌ను తొక్కేశారని మాట్లాడారు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలపై కూడా కక్ష కట్టారని, జూనియర్ సినిమాలను సరిగ్గా ఆడనివ్వకుండా ఇనుప పాదంతో తొక్కేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కాదని.. తెలుగు దొంగల పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















