మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ గా ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. అయితే తారక్ గురించి విమర్శలు చేసేవాళ్లపై రోజా విమర్శలు చేయడంతో పాటు తనదైన శైలిలో కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై కక్ష్య కట్టి తారక్ ను టీడీపీ నుంచి దూరం చేయడం జరిగిందని రోజా అన్నారు.
చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జోలికి ఎందుకు వస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. 2009 సంవత్సరంలో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని ఆ తర్వాత రోజుల్లో అవమానించి పార్టీ నుంచి తరిమేసిందని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివే టైప్ కాదని రోజా అన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితిలో ఉండటం సిగ్గుచేటు అని ఆమె చెప్పుకొచ్చారు. రోజా చేసిన కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ మాత్రం స్పందించడం వల్ల అనవసర విమర్శలకు, వివాదాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని ఫీలవుతున్నారని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రస్తుతం దేవర సినిమాతో తారక్ బిజీగా ఉండగా కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా తారక్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ కొరటాల శివ దేవరతో తమ మార్కెట్ రేంజ్ ను ప్రూవ్ చేసుకోవడం గ్యారంటీ అని నెటిజన్లు ఫీలవుతున్నారు. తారక్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.