‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో ‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ కొడుకు ఆశీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ వంటివి యూత్ ను బాగానే ఆకట్టుకున్నాయి.ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో ఈ చిత్రం రిలీజ్ కు ముందు ఎక్కువగా వార్తల్లో నిలిచింది.
దాంతో సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించేలా నమోదయ్యాయి.కానీ వీకెండ్ తర్వాత ఈ చిత్రం పెర్ఫార్మన్స్ డల్ అయ్యింది.అయినప్పటికీ రెండో వారం ఓకె అనిపించింది. ఒకసారి 2 వారాల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 1.68 cr |
సీడెడ్ | 0.81 cr |
ఉత్తరాంధ్ర | 1.16 cr |
ఈస్ట్ | 0.28 cr |
వెస్ట్ | 0.20 cr |
గుంటూరు | 0.23 cr |
కృష్ణా | 0.23 cr |
నెల్లూరు | 0.15 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.74 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.10 cr |
ఓవర్సీస్ | 0.12 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.96 cr |
‘రౌడీ బాయ్స్’ చిత్రానికి రూ.9.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.4.96 కోట్ల షేర్ ను రాబట్టింది.రెండో వారం ఈ చిత్రం రూ.1.5 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసింది కానీబ్రేక్ ఈవెన్ కు ఈ మాత్రం సరిపోదు. నైజాంలో ఈచిత్రం ఎక్కువ థియేటర్లలోనే రన్ అవుతుంది. కొత్త హీరో సినిమాకి ఈ కలెక్షన్లు ఎక్కువే కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు సగానికి సగం కూడా ఈ చిత్రం రీచ్ అవ్వలేదు.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!