‘బిగ్‌బాస్5’ విన్నర్ సన్నీ పై దాడి జరిగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘బిగ్‌బాస్5’ టైటిల్ విన్నర్ గా నిలిచిన తర్వాత సన్నీకి క్రేజ్ పెరిగింది. దాంతో అతనికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అతను 3,4 సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. సన్నీ నటిస్తున్న సినిమాల్లో ‘ఎ.టి.యం’ అనే మూవీ కూడా ఒకటి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. అయితే జూన్ 8న(నిన్న) అంటే బుధవారం నాడు హైదరాబాద్‌లో ఉన్న హస్తినాపురం ప్రాంతంలో ‘ఎ.టి.ఎం’ షూటింగ్ నిర్వహించారు.
అయితే సాయంత్రం ఆ ప్రాంతంలో ఓ రౌడీషీటర్ సడన్ గా సెట్‌కు సన్నీతో గొడవ పెట్టుకున్నాడు. మొదట ఇది ప్రాంక్ ఏమో అనుకున్నారు. కానీ అతని సన్నీ పై చేయి చేసుకోవడంతో సిబ్బంది వచ్చి.. అతన్ని కంట్రోల్ చేసి సన్నీని కార్ ఎక్కించి పంపించేశారు. ఆ తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పోలీసులు ఆ రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక సన్నీ విషయానికి వస్తే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించి విజేతగా నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన ఈ రియాల్టీ షో లో సన్నీ రూ.50 లక్షల ప్రైజ్ మనీ, సువర్ణ భూమి వారి షాద్ నగర్ వెంచర్ లో రూ.25 లక్షల విలువ చేసే స్థలాన్ని దక్కించుకున్నాడు.
కెరీర్ ప్రారంభంలో విజె గా, జర్నలిస్ట్ గా, సీరియల్ నటుడిగా రాణించిన సన్నీ.. ‘సకల గుణాభి రామ’ అనే చిత్రంలో కూడా నటించాడు. అలాగే ఇప్పుడు ‘అన్ స్టాపబుల్’ ‘ఎ.టి.ఎం’ వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!