4ఏళ్లుగా ప్రేక్షకులు ఎన్నో అసలు పెట్టుకుని ఎదురుచూసిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం నిన్న అంటే మార్చి 25న రిలీజ్ అయ్యింది. సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్- చరణ్- రాజమౌళి కి ఉన్న క్రేజ్ ను బట్టి ఈ సినిమాని చూడడానికి ఎగబడి థియేటర్లకు వస్తున్నారు ప్రేక్షకులు. రాజమౌళి సినిమాలకి టాక్ తో సంబంధం ఉండదు అని ‘ఆర్.ఆర్.ఆర్’ మరోసారి నిరూపించింది. బాహుబలిని మించి అని రాజమౌళి మొదటి నుండీ ఈ మూవీని ప్రమోట్ చేయడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా అన్ని చోట్ల ‘బాహుబలి2’ ని మించి నమోదయ్యాయి.
ఒక్క హిందీలో మాత్రం ‘బాహుబలి2’ రికార్డుని కొట్టలేకపోయింది ‘ఆర్.ఆర్.ఆర్’. ఇక మొదటి కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం
23.30 cr
సీడెడ్
17.00 cr
ఉత్తరాంధ్ర
07.40 cr
ఈస్ట్
05.35 cr
వెస్ట్
05.93 cr
గుంటూరు
07.80 cr
కృష్ణా
04.20 cr
నెల్లూరు
03.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
73.99 cr
తమిళ్ నాడు
04.92 cr
కేరళ
01.71 cr
కర్ణాటక
08.13 cr
నార్త్ ఇండియా (హిందీ)
09.25 cr
ఓవర్సీస్
34.00 cr
రెస్ట్
03.50 cr
టోటల్ వరల్డ్ వైడ్
135.50 cr
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.135.5 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.236 కోట్లను కొల్లగొట్టింది. ‘బాహుబలి2’ మొదటి రోజు సాధించిన రూ.215 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ఈ మూవీ అధిగమించింది.
అయితే హిందీ, కర్ణాటక,కేరళ వంటి ఏరియాల్లో ‘బాహుబలి2’ రికార్డులను కొట్టలేకపోయింది ‘ఆర్.ఆర్.ఆర్’. అయినప్పటికీ చరిత్ర సృష్టించడం విశేషం.