RRR Collections: ఇప్పటికీ డీసెంట్ అనిపిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్లు..!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ విజయవంతంగా 47 రోజులు పూర్తి చేసుకుని 50 రోజుల దిశగా పరుగులు తీస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో, ఓవర్సీస్ లో, కర్ణాటకలో ఈ మూవీ లాంగ్ రన్ ను బాగానే కొనసాగిస్తుంది.గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మూవీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుండడం విశేషం. కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ వద్ద ‘ఆర్.ఆర్.ఆర్’ ఇలా పెర్ఫార్మ్ చేస్తుండడం ట్రేడ్ ను సైతం ఆశ్చర్యం కలిగించే విషయం.

‘కె.జి.ఎఫ్ 2’ ‘ఆచార్య’ ఎంట్రీ ఇచ్చినా ఇలా కలెక్ట్ చేస్తుండడం అంటే మాములు విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ‘బాహుబలి 2’ కలెక్షన్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్’… మిగిలిన వెర్షన్ల విషయంలో ‘బాహుబలి'(సిరీస్) కలెక్షన్లను అధిగమించే అవకాశాలు లేవు. కానీ ఇప్పటికీ ఓకే అనిపిస్తుంది.ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 47 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 111.94 cr
సీడెడ్  50.60 cr
ఉత్తరాంధ్ర  33.10 cr
ఈస్ట్  16.33 cr
వెస్ట్  13.24 cr
గుంటూరు  18.15 cr
కృష్ణా  14.66 cr
నెల్లూరు  09.37 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 267.39 cr
తమిళనాడు  38.27 cr
కేరళ  10.68 cr
కర్ణాటక  44.31 cr
హిందీ 133.42 cr
ఓవర్సీస్ 102.35 cr
రెస్ట్ 10.00 cr
టోటల్ వరల్డ్ వైడ్ 606.42 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)

 

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 47 రోజులు పూర్తయ్యేసరికి రూ.606.42 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1129(కరెక్టెడ్) కోట్లు కొల్లగొట్టింది.తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. మిగిలిన వెర్షన్ లలో బ్రేక్ ఈవెన్ సాధించింది.

లాభాలు తెచ్చిపెడుతుంది. అయితే ‘బాహుబలి2’ ఓవరాల్ కలెక్షన్లను ‘ఆర్.ఆర్.ఆర్’ అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు. ‘బాహుబలి 2’ ఫుల్ రన్లో రూ.814 కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. రూ.1783 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం త్వరలో చైనాలో కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో అక్కడ కనుక హిట్ అయితే మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus