తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ… ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్లకు ఏమాత్రం బ్రేకులు పడలేదు. వీకెండ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ వీకెండ్ తర్వాత కూడా అదే జోరుని చూపిస్తూ దూసుకుపోతుంది. రాజమౌళి సినిమాలకి టాక్ తో సంబంధం ఉండదు అని ‘ఆర్.ఆర్.ఆర్’ మరోసారి నిరూపించింది. బాహుబలిని మించి అని రాజమౌళి మొదటి నుండీ ఈ మూవీని ప్రమోట్ చేయడంతో వీకెండ్ వరకు ఆ ఫీట్ ను సాధించింది. అయితే నార్త్ లో ‘బాహుబలి2’ ని మించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అలా అని తగ్గడం లేదు. ఇప్పటికే అక్కడ రూ.100కోట్లకి పైగా నెట్ కలెక్షన్లను సాధించింది లెండి.
ఒకసారి 6 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 72.88 cr |
సీడెడ్ | 35.92 cr |
ఉత్తరాంధ్ర | 20.16 cr |
ఈస్ట్ | 10.79 cr |
వెస్ట్ | 09.48 cr |
గుంటూరు | 13.43 cr |
కృష్ణా | 10.27 cr |
నెల్లూరు | 06.11 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 179.04 cr |
తమిళనాడు | 23.37 cr |
కేరళ | 05.49 cr |
కర్ణాటక | 25.87 cr |
హిందీ | 60.10 cr |
ఓవర్సీస్ | 71.20 cr |
రెస్ట్ | 05.49 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 370.50 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.370.52 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.669 కోట్లను కొల్లగొట్టింది. రెండో వీకెండ్ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం భారీగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాది సెలవు కూడా ఉండడం ఈ చిత్రానికి మరింత అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?