మార్చి 25న విడుదల అయిన రాజమౌళి- ఎన్టీఆర్- చరణ్ ల ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ రూ.1100 కోట్ల కలెక్షన్‌ల మైలురాయిని చేరుకుంది. ఈరోజు కలెక్షన్లతో ఆ ఫీట్ ను సాధించినట్టు స్పష్టమవుతుంది. డివివి దానయ్య నిర్మాణంలో రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన మూవీ ఇది. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఎక్కువ థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. మొదటి రోజు కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రాజమౌళి అలాగే హీరోల క్రేజ్ కారణంగా భారీ వసూళ్లను సాధిస్తూ అనేక రికార్డులను కొల్లగొట్టింది.
ఒక్క నైజాంలోనే 110 కోట్ల కలెక్షన్‌లను రాబట్టిన తొలి మూవీగా రికార్డ్ సృష్టించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అలాగే తెలుగు వెర్షన్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఓవర్సీస్ లో కూడా రూ.100 కోట్ల షేర్ ను వసూల్ చేసి చరిత్రను తిరగరాసింది ‘ఆర్.ఆర్.ఆర్’. హిందీలో కూడా రూ.260 కోట్లకి పైగా నెట్ కలెక్షన్లను సాధించింది. త్వరలో చైనా వంటి దేశాల్లో కూడా ఈ మూవీ విడుదల కాబోతుంది. అలాగే జపాన్ లో కూడా ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
జపాన్ లో రాజమౌళి మరియు ఎన్టీఆర్ ల సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. దాంతో అక్కడ కూడా ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే అక్కడ ఎప్పుడు విడుదల చేసేది ఇంకా దర్శక నిర్మాతలు ప్రకటించలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్, చరణ్ లు ఇద్దరూ కూడా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!