బాహుబలి2, సాహో సినిమాలు థియేటర్ల కౌంట్ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి2 సినిమా ఏకంగా 9,000 థియేటర్లలో విడుదల కాగా సాహో మూవీ 7978 థియేటర్లలో విడుదలైంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఈ రికార్డులను సులువుగా బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 10,200 థియేటర్లలో విడుదల కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. కథ సింపుల్ గా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నా కథనంతో జక్కన్న మ్యాజిక్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న నాలుగో హ్యాట్రిక్ సాధించారు.
స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం. అయితే సినిమాలో శ్రియ స్క్రీన్ స్పేస్ విషయంలో నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో కేవలం నాలుగు నిమిషాలకు పరిమితమైన పాత్రలో శ్రియ కనిపించడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూడు గంటల నిడివి ఉన్న సినిమా అయినప్పటికీ హీరోలిద్దరికీ మినహా మిగతా ఎవరికీ పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమా శ్రియ కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడదని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రియ పాత్ర సినిమాలో ఉన్నట్టా? లేనట్టా? అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఎంతోమంది కెరీర్ కు ప్లస్ అవుతుందనడంలో సందేహం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తో తారక్, చరణ్ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు సొంతం చేసుకున్నట్టే అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే రికార్డులు క్రియేట్ అవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాహుబలి2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ లో క్రియేట్ అయిన అన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.