ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చిన ఈ సినిమా కొన్ని వారాల క్రితం జపాన్ లో విడుదలై అక్కడి ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది. రాజమౌళి, తారక్, చరణ్ జపాన్ కు వెళ్లి ఈ సినిమా ప్రమోషన్స్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ సినిమా జపాన్ లో విడుదలై చాలారోజులే అయినా అక్కడి థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
ఈ సినిమాను చూడటానికి కొంతమంది ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ ఫ్యాన్స్ ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేశారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. జపాన్ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమాపై చూపిస్తున్న అభిమానానికి ఆ సినిమా మేకర్స్ ఎంతో హ్యాపీగా ఫీలవుతూ ఉండటం గమనార్హం. చరణ్, తారక్ లకు భారీగా అక్కడ క్రేజ్ రావడం అభిమానుల సంతోషానికి కారణమవుతోంది.
విజువల్ వండర్ గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై దాదాపుగా ఎనిమిది నెలలైనా ఏదో ఒక విధంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తుండటం ఈ సినిమా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో పాన్ ఇండియా హీరోలుగా మార్కెట్ ను పెంచుకున్న చరణ్, ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని భావిస్తున్నారు.
ఆచార్య సినిమా నిరాశపరిచిన నేపథ్యంలో ప్రాజెక్ట్ ల ఎంపికలో చరణ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు. వచ్చే ఏడాది చరణ్ శంకర్ కాంబో మూవీ థియేటర్లలో విడుదల కానుంది. తారక్ సైతం త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!