టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమా హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ అమెరికాలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. బుకింగ్స్ స్టార్ట్ అయిన కొన్ని గంటల్లోనే 1,75,000 డాలర్లు వసూలు చేసింది.
రోజులు గడిచే కొద్దీ ఈ మొత్తం పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీమియర్స్ తోనే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తెలుగు ట్రైలర్ యూట్యూబ్ లో 36 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్లు సాధారణ ధరలతోనే అమెరికాలో ప్రీమియర్లను ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. దాదాపుగా 1,000 మల్టీప్లెక్స్ లలో అమెరికాలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. అమెరికాలో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రాజమౌళి గత సినిమాలు అమెరికాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. ఈ సినిమా బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. చరణ్, తారక్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 1,000 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. 2022లో రిలీజవుతున్న తొలి పెద్ద సినిమా అయిన ఆర్ఆర్ఆర్ అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.
అలియా భట్ ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. సీత పాత్రతో అలియా భట్ ప్రేక్షకుల మెప్పు పొందడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. డీవీవీ దానయ్యకు ఈ సినిమా ద్వారా రిలీజ్ కు ముందే భారీగా లాభాలు వచ్చాయని సమాచారం.