తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాహుబలి సినిమా కంటే ఎక్కువగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్ చరిత్రను సృష్టిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తప్పకుండా ఈ సినిమా మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుంది అని కూడా ప్రస్తుతం బజ్ చూస్తేనే అర్థమవుతుంది.
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం దాదాపు 550 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద 450 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా ఈజీగా వెయ్యి కోట్ల వసూళ్లను సాధిస్తుంది అని కూడా ఒక టాక్ వినిపిస్తోంది. కానీ హిందీ లో మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అయితే పెరగలేదు. మొత్తానికి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
మొన్నటి వరకు అయితే రెండు నెలల తర్వాత నే పోటీలో రాబోయే అవకాశం ఉందని సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాను మూడు నెలల తర్వాతనే ఓటీటీ లో విడుదల చేయాలని బలమైన నిర్ణయం తీసుకున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు అని ఫలితంతో సంబంధం లేకుండా మూడు నెలల తర్వాతనే త్రిబుల్ ఆర్ సినిమా థియేటర్స్ లో కి విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర యూనిట్ సభ్యులు వివరణ ఇచ్చారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్ హక్కులను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా.. హిందీ వెర్షన్ హక్కులను మాత్రం నెట్‌ఫ్లిక్స్ కొనుగొలు చేసింది. ఇక ఈ సినిమాను జూలై నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.