ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలలో గుబులు మొదలైంది. డి వి వి దానయ్యకు రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. దానికి కారణం ఆర్ ఆర్ ఆర్ భవిష్యత్ ఏమిటన్న ప్రశ్నే. అనుకున్న సమయాని కంటే ఆర్ ఆర్ ఆర్ దాదాపు ఏడాది ఆలస్యంగా రానుంది. లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా షూటింగ్ నిలిచిపోయింది. దీనితో చెప్పినట్లుగా జనవరి 2021లో విడుదల అయ్యే అవకాశం లేదు. సినిమా షూటింగ్ లేటయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది.
సినిమా విడుదల ఆలస్యం అవుతుంటే పెట్టుబడి పై వడ్డీ భారం తడిసి మోపెడు అవుతుంది. ఇప్పటికే వందల కోట్లు ఈ చిత్రం నిర్మాణం కోసం నిర్మాతలు వెచ్చించారు. ఇవి చాలవనట్లు బయట షూటింగ్స్ నిర్వహించే పరిస్థితి లేని కారణంగా భారీ సెట్స్ నిర్మించి షూటింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీదైన సెట్స్ కోసం మరి కొన్ని కోట్లు అదనపు ఖర్చు బడ్జెట్ లో వచ్చి చేరింది. ఈ సినిమా కొన్న బయ్యర్లకు సైతం అభద్రతా భావం మొదలైంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గక పోతే థియేటర్స్ తెరుచుకుంటాయా? ఒక వేళ తెరుచుకున్నా గతంలో మాదిరి సినిమా థియేటర్స్ కి రావడానికి ప్రేక్షకులు ఇష్టపడతారా? అనే అనుమానాలు లేస్తున్నాయి.
ప్రేక్షకులలో కరోనా వైరస్ పై పూర్తిగా భయం పోయినప్పుడు మాత్రమే ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాకు వందల కోట్ల వసూళ్లు సాధ్యం అవుతాయి. లేదంటే అంత పెట్టుబడిని రికవరీ చేయడం కష్టమైన పనే. ఒకవేళ థియేటర్స్ తెరుచుకోని పక్షంలో ఓ టి టి ల ద్వారా ఇన్ని వందల కోట్ల పెట్టుబడి రాబట్టడం సాధ్యమయ్యే పనేనా?. ఇన్ని సవాళ్లు ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు ముందు ఉన్నాయి.
Most Recommended Video
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!