రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ సినిమాకు ఎదురుకాని ఇబ్బందులు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురవుతున్నాయి. ఈ సినిమా త్వరగా రిలీజైతే తమ ఫేవరెట్ హీరోలకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కుతుందని భావిస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్ఆర్ఆర్ వాయిదా పడగా మరోసారి ఈ సినిమాను వాయిదా వేస్తే ఈ సినిమా రిజల్ట్ పై ఆ ప్రభావం పడుతుంది. ఆర్ఆర్ఆర్ టీం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఇప్పటికే ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించాలంటే కొన్ని వారాల పాటు థియేటర్లలో ఉండాలి. ఆర్ఆర్ఆర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాలతో పోటీ వల్ల ఆర్ఆర్ఆర్ మూవీకి థియేటర్ల సంఖ్య విషయంలో భారీస్థాయిలో నష్టం తప్పదు. మరోవైపు తమిళంలో ఆర్ఆర్ఆర్ కు పోటీగా అజిత్ నటించిన వాలిమై సినిమా రిలీజ్ కానుంది. అజిత్ సినిమా విడుదలైతే ఆర్ఆర్ఆర్ కు ఎంత మంచి టాక్ వచ్చినా తమిళనాడులో ఆర్ఆర్ఆర్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చెప్పవచ్చు.
ఈ సమస్యలను అధిగమించడానికి ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ను రాజమౌళి కలవడానికి ప్రయత్నించినా కుదరలేదని సంక్రాంతికి భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ మధ్య పోటీ తప్పదని తెలుస్తోంది. ఈ సమస్యల వల్ల ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు వచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పవచ్చు. బాహుబలి, బాహుబలి2 సినిమాలకు రిలీజ్ డేట్ ప్లస్ కాగా ఆర్ఆర్ఆర్ కు రిలీజ్ డేట్ మైనస్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.