దర్శకధీరుడు రాజమౌళి ఏళ్ల తరబడి ఊహించడానికే కష్టం అనుకున్న తెలుగు సినిమాకి, ఇండియాలోనే మొట్ట మొదటి ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టారు.. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘నాటు నాటు’ ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ అరుదైైన, చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించిన కీరవాణి, చంద్రబోస్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ తదితరులకు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు..
ఆస్కార్ ఏమీ అంత ఈజీగా రాలేదు.. దీని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీం.. ముఖ్యంగా రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఎంతో కృషి చేశారు.. కోటాను కోట్లు ఖర్చు పెట్టి దేశ విదేశాల్లో సినిమాను ప్రదర్శించి.. కమిటీ దృష్టిలో పడేలా చేశారు.. దీని కోసం లాస్ ఏంజెల్స్‌లో ఓ ఇంటిని కూడా వారు అద్దెకు తీసుకున్నారు.. ఎట్టకేలకు హిస్టరీ క్రియేట్ చేశారు.. దాదాపు నెల రోజులకు పైగానే వారు యూఎస్ఎలో ఉన్నారు.. ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ తిరిగొచ్చిన సంగతి తెలిసిందే..
తెల్లవారు ఝామున తారక్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు ఫ్యాన్స్.. ఇదిలా ఉంటే మార్చి 17 ఉదయం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ హైదరాబాద్ చేరుకున్నారు.. రాజమౌళి, కీరవాణి, కార్తికేయ, శ్రీసింహా, రమా రాజమౌళి తదితరులు విమానాశ్రయంలో కెమెరాల కంట పడ్డారు.. రాజమౌళి – మహేష్ బాబు నిర్మాత డా.కె.ఎల్. నారాయణ కూడా వారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు.. ఇక అభిమానులు రాజమౌళిని చుట్టుముట్టారు.. ఆయనతో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు కానీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు..
మీడియా మాట్లాడవలసిందిగా కోరగా.. ‘‘జైహింద్’’ అంటూ అక్కడినుండి వెళ్లిపోయారు జక్కన్న.. కాగా రామ్ చరణ్ యూఎస్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లాడు.. శుక్రవారం (మార్చి 17) ఢిల్లీలో జరుగబోయే ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’ పాల్గొనబోతున్నాడు.. అక్కడే ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నాడు చరణ్.. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా రానున్నారు..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్