Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీమియర్ షో రివ్యూ!

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీమియర్ షో రివ్యూ!

  • March 25, 2022 / 01:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీమియర్ షో రివ్యూ!

కథ : నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో ఈ కథ మొదలైంది. నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకువెళ్తాడు. ఆ గోండు జాతి కాపరి కొమురం భీంకి(ఎన్టీఆర్) ఈ విషయం తెలుస్తోంది. కొమురం భీం తమగూడెం పిల్ల కోసం దొరల ఏలుబడిలో ఉన్న ఢిల్లీలో అడుగుపెట్టి అక్కడ విద్వంసం సృష్టించి ఆ పిల్లను రక్షిస్తాడు. దాంతో కొమురం భీం (ఎన్టీఆర్)ను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను సీతారామరాజు (రామ్ చరణ్)కు అప్పగిస్తోంది బ్రిటీష్ ప్రభుత్వం. అయితే, రామరాజు కొమురం భీమ్ లోని నిజాయితీ, మంచితనం నచ్చి అతనికి సాయం చేస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటీషు ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది.

ఈ విషయం ఏమి తెలియని భీం అనుకోకుండా సీతను కలుసుకుంటాడు. ఆమె పెట్టిన సద్ది తిని ఆకలి తీర్చుకున్న భీం ఆమె కష్టానికి కరిగిపోతాడు. మనువాడిన వాడు ఉరికంభం ఎక్కబోతున్నాడని సీత కన్నీరు పెట్టుకుంటుంది. రామరాజు గురించి భీంకు మొత్తం నిజం తెలుస్తోంది. నీ భర్త రాముడు లాంటి వాడు, రాముడికి కష్టం వస్తే వెళ్లాల్సింది సీతమ్మ కాదు. ఈ లక్ష్మణుడు అంటూ కొమురం భీం మళ్లీ బ్రిటీష్ పై అటాక్ చేసి రామరాజును జైలు నుంచి తప్పిస్తాడు. ఇలా మొదలైన వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది ? బ్రిటిష్ ప్రభుత్వం పై భీమ్, రామరాజు కలిసి ఏ విధంగా పోరాటం చేశారు ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ: నటి నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా ఎన్టీఆర్ – చరణ్ ల గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌, చరణ్‌ల నటన హృదయాలను హత్తుకుంటుంది. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి. కథను బట్టి ఇద్దరి ఐడియాలజీ వేరు అయినా.. ఉత్తర, దక్షిణ ధృవాల్లా ఇద్దరు చెరో దారిలో తమ ప్రయాణం సాగించినా.. రెండు పాత్రల మధ్య బాండింగ్ ను రాజమౌళి చాలా గొప్పగా ఎలివేట్ చేశాడు.

ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఇద్దరూ సింహాల్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా.. రెండు పాత్రల మధ్య ఎమోషన్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఆడియెన్స్ కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. హీరోలిద్దరూ తమ పాత్రల కోసం పడిన కష్టం అద్భుతం. ఆ విషయంలో ఇద్దరినీ మెచ్చుకోవాలి.

అలియా భట్ కూడా సీత పాత్రలో ఒదిగిపోయింది.. ఈ సినిమాలో మిగిలిన కీలక పాత్రల్లో నటించిన ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ , శ్రీయా అలాగే మిగిలిన లార్జ్ స్టార్ కాస్ట్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గ, క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రల్లో అద్భుతంగా నటించారు. అయితే, ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ – చరణ్ ల ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.

చరణ్ – అలియా మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఓవరాల్ గా ఇది ఒక యూనిక్ సబ్జెక్టు. అలాగే ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా వండర్ గా అనిపిస్తోంది. ఈ క్లైమాక్స్ ను ముందే ఏ ప్రేక్షకుడు ఊహించలేడు. అసలు ఈ ఊహించని రీతిలో క్లైమాక్స్ ను డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే.

తీర్పు : మొత్తమ్మీద ఈ చిత్రం ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్. చివరగా ఒక్క మాటలో ‘ఆర్ఆర్ఆర్’ అబ్బుర పరుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

trending news

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

1 hour ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

13 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

14 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

20 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

21 hours ago

latest news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

2 hours ago
Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

7 hours ago
RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

7 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

7 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version