RRR: హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఐదు అవార్డులు ఏవంటే..?

తెలుగు సినిమా ఖ్యాతిని ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మరోసారి విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా.. తెలుగు వారి ప్రతిభకి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా మంత్రముగ్దులయ్యేలా చేశారు.. ట్రిపులార్ విడుదలై ఏడాది 11 నెలలు అయినా ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.. అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది.. కలలో కూడా టాలీవుడ్ సెలబ్రిటీలు హాలీవుడ్ స్టేజ్ మీద నిలబడతారని కానీ.. హాలీవుడ్ లెజెండరీ ఫిలిం మేకర్స్ మన తెలుగు సినిమా గురించి మాట్లాడతారని కానీ ఊహించలేదు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు జక్కన్న..

ఇప్పటికే పలు అవార్డులతో పాటు గోల్డెన్ గ్లోబ్ అందుకున్న ట్రిపులార్ మరోసారి హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి.. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA ) అవార్డ్స్ – 2023లో సత్తా చాటింది ట్రిపులార్.. ఏకంగా ఐదు అవార్డులు సాధించింది.. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (నాటు నాటు), ‘బెస్ట్ స్టంట్స్’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’, ‘ HCA స్పాట్ లైట్’ అవార్డులు గెలుచుకుంది.. ‘బ్లాక్ పాంథర్’, ది వుమెన్ కింగ్’, ‘ది బ్యాట్ మెన్’ లాంటి హాలీవుడ్ మూవీస్‌ని వెనక్కి నెట్టి మరీ ఈ ఘనత సాధించింది ట్రిపులార్..

ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. అవార్డ్స్ అందజేసినందుకు హెచ్‌సీఏ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.. ఎంతో శ్రమించి ఈ సినిమాలో స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్.. క్లైమాక్స్‌లో కొన్ని సీక్వెన్సులు కంపోజ్ చేసిన జూజీతో పాటు మా సినిమా కోసం ఇండియా వచ్చి.. మా విజన్ అర్థం చేసుకుని.. మాకనుగుణంగా మారి.. కష్టపడిన స్టంట్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు.. సినీ ప్రియులను అలరించడం కోసం స్టంట్ మాస్టర్స్ ఎంతో శ్రమిస్తుంటారు..

ఈ సభా ముఖంగా ప్రతిష్టాత్మక అవార్డులు అందించే వారికి నాది ఒక చిన్న విన్నపం.. ఇకపై అవార్డుల జాబితాలో స్టంట్ కొరియోగ్రాఫర్స్ విభాగాన్నికూడా చేర్చాలని కోరుతున్నా.. ట్రిపులార్ మూవీలో రెండు, మూడు షాట్స్‌లో మాత్రమే డూప్స్‌ని వాడాం.. మిగతావన్నీ ఎన్టీఆర్, రామ్ చరణే స్వయంగా చేశారు.. 320 రోజుల పాటు షూటింగ్ చేస్తే అందులో ఎక్కువ రోజులు స్టంట్స్ కోసమే వర్క్ చేశాం అన్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus