సినిమాను ఎంత గ్రాండ్ గా తీస్తారో.. అదే రేంజ్ లో ప్రమోషన్స్ ప్రమోట్ కూడా చేస్తుంటారు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘రాధేశ్యామ్’ కూడా రిలీజ్ కాబోతుంది కానీ ఇంతవరకు ఆ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచలేదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మాత్రం దేశం మొత్తం చుట్టేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా బాగా ప్రమోట్ చేస్తున్నారు.
ఇప్పటికే ముంబైలో ప్రెస్ మీట్లు, ప్రీరిలీజ్ ఈవెంట్లను నిర్వహించారు. దీనికి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ ని గెస్ట్ గా తీసుకొచ్చి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయగలిగారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కపిల్ శర్మ షోకి వెళ్లడానికి రెడీ అవుతోంది. కపిల్ శర్మ స్టాండప్ కమెడియన్ అనే సంగతి తెలిసిందే. ఆయన షో బాలీవుడ్ లో చాలా పాపులర్. ఈ షోకి వస్తోన్న టీఆర్ఫీ మరే షోకి రావడం లేదట. ఎంత పెద్ద సినిమా అయినా..
ఈ కామెడీ షోకి వెళ్లి ప్రమోట్ చేసుకోవాల్సిందే. అందుకే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా ఈ షోలో కనిపించబోతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో పాటు అలియాభట్ కూడా ఈ షోకి వెళ్లబోతుంది. కపిల్ శర్మకి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నాయి. వారంతా ఈ షోని చూస్తారు కాబట్టి.. ‘ఆర్ఆర్ఆర్’కి మరింత ప్రమోషన్ దొరుకుతుంది. మొత్తానికి రాజమౌళి తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా.. అసలు తగ్గడం లేదు.