గత రెండు,మూడు రోజులుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ఏంటి అంటే… ‘మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. లు తమ అప్ కమింగ్ సినిమాలను 2023 సంక్రాంతి బరిలో దింపాలని ప్రయత్నిస్తున్నట్టు ఆ న్యూస్’. బాలయ్య, చిరు సినిమాలు సంక్రాంతికి పోటీ పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. సంక్రాంతికి ఎలాగు 4 పెద్ద సినిమాలు రిలీజ్ అయినా జనాలు చూస్తారు. అందులో పెద్ద ఇబ్బంది లేదు.
కానీ వీరిద్దరి సినిమాలకి ఒక్కరే నిర్మాత కాబట్టి ఈ ఇబ్బంది అంతా..! ఈ రెండు సినిమాలను నిర్మిస్తుంది ‘మైత్రి’ సంస్థే. ఏ నిర్మాణ సంస్థ అయినా తమ సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయాలి అని అనుకోరు. ఎందుకంటే థియేటర్ల సమస్య వస్తుంది. అలాగే ఒక సినిమా వల్ల ఇంకో సినిమా కలెక్షన్లు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంది. ఇదంతా ఓ పక్కన పెడితే… ఈ ఇద్దరి సీనియర్ హీరోలు తమ సినిమాలను కచ్చితంగా సంక్రాంతికే విడుదల చేయాలి అని నిర్మాతల పై ఒత్తిడి పెడుతున్నారని సోషల్ మీడియాలో గాసిప్పులు షికార్లు చేస్తున్నాయి.
చిరంజీవి సినిమాని ఎలాగూ సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించి చాలా కాలం అయ్యింది. అయితే తన సినిమాని కచ్చితంగా సంక్రాంతికే రిలీజ్ చేయాలని బాలయ్య నిర్మాతల పై ఒత్తిడి పెడుతున్నట్టు తాజా సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం పై కాస్త ఎక్కువగానే చర్చ జరగడంతో.. ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. తన సినిమా విడుదల విషయంలో బాలయ్య ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడం లేదు అనేది అతని సన్నిహిత వర్గాల సమాచారం.
డిసెంబర్ నెలలో బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాబట్టి అదే నెలలో తన సినిమాని రిలీజ్ చేసినా ఇబ్బంది లేదని చెప్పకనే చెప్పారట. పైగా 2023 సమ్మర్ కు అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోయే సినిమాని కూడా రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాబట్టి ఇప్పటికైనా బాలయ్య పై ఆ రూమర్స్ ఆగుతాయేమో చూడాలి.