Prabhas, Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ పై ప్రభాస్ రివ్యూ… అసలు మేటర్ ఏంటి?

ఇటీవల విడుదలైన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ని చూసి ప్రభాస్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడని కొన్ని గంటలుగా అనేక వార్తలు వస్తున్నాయి! సినిమా విడుదల రోజున రాత్రి ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకుని మరీ ప్రభాస్ సినిమా చూశాడని … ఆ తర్వాత ‘సినిమా చాలా బాగుంది, మహేష్ నటన, కామెడీ టైమింగ్, ఫైట్స్ నచ్చాయని’ ప్రభాస్ చెప్పినట్టు ఆ వార్తల సారాంశం. ఇది నిజమని నమ్మిన కొంతమంది మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు అన్నది ప్రభాస్ సన్నిహిత వర్గం చెబుతున్న మాట. ‘ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు.. కానీ ఆయన ‘సర్కారు వారి పాట’ సినిమా చూడలేదు.సినిమా చూడకుండా ఆయన ఎలా స్పందిస్తారు. అవన్నీ గాలి వార్తలు’ అంటూ ప్రభాస్ సన్నిహిత వర్గం చెప్పుకొచ్చింది.అంతేకాదు ప్రభాస్ ఏమైనా చెప్పాలి అనుకుంటే తన ‘ఫేస్బుక్ పేజీ ద్వారా పోస్ట్ చేస్తారు’ అని కూడా వారు తెలియజేశారు.

దీనిని బట్టి ప్రభాస్.. మహేష్ సినిమా పై ఎటువంటి కామెంట్స్ చేయలేదు అని తేలిపోయింది. అయితే మిగిలిన స్టార్ హీరోలలో ఎవ్వరూ కూడా మహేష్ సినిమా పై స్పందించింది లేదు. రాంచరణ్ మాత్రం ప్రత్యేకంగా మహేష్ ను కలిసి ఈ సినిమా పై మహేష్ తో ముచ్చట్లు పెట్టినట్టు ఇన్సైడ్ టాక్. అయితే చరణ్ తన సోషల్ మీడియాలో ఎటువంటి ట్వీట్ వేయలేదు.అలాగే చిరంజీవికి కూడా నిర్మాతలైన ‘మైత్రి’ వారు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు అని సమాచారం.

అది వీకెండ్లోనా లేక వీకెండ్ అయ్యాకా అన్నది తెలియాల్సి ఉంది. చిరు మైత్రి వారి బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నారు కాబట్టి స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఇది మంచి సందేశాత్మక చిత్రం అనే ఆదరణ పొందింది. కాబట్టి బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus