Kalki Movie: ప్రభాస్ కల్కి ప్లానింగ్ వేరే లెవెల్ అంటున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ సినిమా ఇప్పటివరకు 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోగా ప్రాజెక్ట్ కే మూవీ సలార్ కు డబుల్ కలెక్షన్లను సొంతం ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రాజెక్ట్ కే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అని ఈ సినిమాతో ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్తారని తెలుస్తోంది.

కల్కి మూవీ 20కు పైగా భాషల్లో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ అన్ని భాషల్లో ఈ సినిమా విడుదలైతే మాత్రం బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ప్రభాస్ సైతం ఈ సినిమా (Kalki) రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ ఏడాది మే నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి కావడానికి మరో మూడేళ్ల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పాలని అభిమానులు భావిస్తున్నారు.

ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభాస్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. ప్రభాస్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం అందుకుంటున్నారు. ప్రభాస్ సినిమాలు ఇతర భాషల్లో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus