రష్యా వాళ్లు భలే ఆలోచన చేశారుగా

అంతరిక్షం గురించి ఓ సినిమా రాబోతోంది. ఏముంది హాలీవుడ్‌లో కొన్ని సినిమాలొచ్చాయి. అంతెందుకు మన దగ్గర సంకల్ప్‌ రెడ్డి కూడా ‘అంతరిక్షం’ అనే సినిమా చేశాడు. తమిళంలో కూడా ‘టిక్‌ టిక్‌ టిక్‌’ అనే ఏదో సినిమా తీశాడు. మన దగ్గర కూడా రిలీజ్‌ అయ్యింది అని ఫ్లోలో చెప్పేయొద్దు. ఈ అంతరిక్షం సినిమా చాలా స్పెషల్‌. అంత స్పెషల్ ఏంటనేగా మీ మాట. అయితే చూసుకోండి… ఈ సినిమాను అంతరిక్షంలోనే చిత్రీకరించబోతున్నారు. అదన్నమాట సంగతి.

అంతరిక్షం నేపథ్యంలో రూపొందించే సినిమాలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది గ్రీన్‌ మ్యాట్‌. చుట్టూ ఓగ్రీన్‌ మ్యాట్ వేసేసి… ఆ తర్వాత అంతరిక్షంలో ఉన్నట్లు విజువల్‌ ఎఫెక్ట్స్‌ను యాడ్‌ చేస్తారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలాంటి గ్రీన్‌ మ్యాట్ ట్రిక్‌. అయితే రష్యాకు చెందిన ఓ సంస్థ ఇలా అనుకోలేదు. అంతరిక్షం అంటే అక్కడికే వెళ్లి సినిమా తీద్దాం అనుకుంది. దీని కోసం ఆ సినిమా దర్శకుడు, నటి త్వరలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ఈ మేరకు పనులు మొదలయ్యాయట.

ఈ స్పెషల్‌ సినిమాకు పేరు కూడా స్పెషల్‌గానే పెట్టారు.. అదే ‘ఛాలెంజ్‌’. రష్యన్‌ నటి యూలియా పెరిసిల్డ్‌ కీలక పాత్రధారి. నటుడు, దర్శకుడు అయిన క్లిమ్‌ షెపెంకో ఈ సినిమాలో మరో పాత్రధారి. అయితే రష్యా ఈ నిర్ణయం తీసుకోవడానికి అమెరికా ఓ కారణమట. అమెరికా ఆధిపత్యం తగ్గించడానికే రష్యా ఈ అంతరిక్షం షూటింగ్‌ ఏర్పాట్లు చేస్తోందట. ఎందుకంటే టామ్‌ క్రూజ్‌ హీరోగా అమెరికా స్పేస్‌లో ఓ సినిమా షూట్‌ చేయాలని ఇటీవల నిర్ణయించింది. అయితే మరి రష్యా సినిమా మరి షూటింగ్‌ ఎలా జరుగుతుంది, సినిమా ఎలా రాబోతోంది, ఎలా ఉండబోతోంది అనేది త్వరలో తెలుస్తుంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus