Saami Saami Song: ‘పుష్ప’ నుండీ అలరిస్తున్న 3వ పాట..!

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కూడా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా 3వ పాటని కూడా విడుదల చేశారు. ‘సామి సామి’ అంటూ సాగె ఈ పాటకి సంబంధించి రెండు రోజుల క్రితమే ఓ ప్రోమోని కూడా విడుదల చేశారు.

ఇప్పుడు ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. మౌనిక యాదవ్ పాడిన ఈ పాట సినిమాలో ఓ ఫోక్ నెంబర్ గా ఉండబోతుందని స్పష్టమవుతుంది. చంద్రబోస్ సాహిత్యం సమకూర్చిన ఈ పాటకి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ ఆకట్టుకుంటుంది. పుష్ప రాజ్ పై శ్రీవల్లికి ఉన్న ప్రేమని… ఈ ఫోక్ సాంగ్ స్టైల్లో తెలుపుతుందన్న మాట. ఈ పాటలో అల్లు అర్జున్ లుక్ మాస్ ఆడియెన్స్ కు మంచి కిక్ ఎక్కించే విధంగా ఉందని చెప్పొచ్చు.

గుబురు గడ్డం.. తొడల పై వరకు లుంగీలో మన బన్నీ ఊర నాటుగా కనిపిసితున్నాడు. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ అందించడం జరిగింది. రష్మిక గ్లామర్ కూడా ఈ పాటకి అదనపు ఆకర్షణ చేకూర్చింది అని చెప్పొచ్చు. సినిమాలో ఈ పాటకి విజిల్స్ పడడం గ్యారెంటీగా కనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus