Saana Kastam Song: ‘సానా కష్టం’ సాంగ్ వచ్చేసింది చూశారా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన ఫిబ్రవరి 4న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను, టీజర్లను విడుదల చేశారు.

ఇక సినిమాలో హైవోల్టేజ్ ఐటెం సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నిన్ననే ‘సానా కష్టం’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేయగా.. తాజాగా పూర్తి పాటను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి, యంగ్ హీరోయిన్ రెజీనాతో కలిసి స్టెప్పులు వేస్తూ కనిపించారు. చాలా కాలం తరువాత రెజీనా తెలుగులో కనిపించబోతుంది. ఈ పాటలో మణిశర్మ మాస్ బీట్ కి చిరు స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాటను గీతామాధురి, రేవంత్ ఆలపించగా..

భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు. రిలీజ్ డేట్ కి మరో నెల రోజులు సమయం ఉండడంతో ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. దీనికోసం చిరు, రామ్ చరణ్ ఇద్దరినీ రంగంలోకి దింపబోతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇబ్బంది పెట్టకపోతే గనుక ఈ సినిమా చెప్పిన టైంకి రావడం గ్యారంటీ.. నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌తో ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల.

ఈ సినిమాతో మంచి మెసేజ్ చెప్పబోతున్నారు కొరటాల శివ. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. రామ్ చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus