Sabdham Collections: ఫ్లాప్ గా మిగిలిన ‘శబ్దం’….?

ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోగా లక్ష్మీ మీనన్ (Lakshmi Menon), సిమ్రాన్ (Simran), లైలా (Laila) వంటి వారు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘శబ్దం’(Sabdham). హారర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ అయ్యింది. ‘వైశాలి’ వంటి డీసెంట్ హారర్ మూవీని అందించిన అరివళగన్ (Arivazhagan Venkatachalam)  ఈ చిత్రానికి దర్శకుడు. తమన్ (S.S.Thaman)  సంగీతం అందించారు. హిట్టు కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్లో రాలేదు.

Sabdham Collections:

వీక్ డేస్లో ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా తగ్గాయి. తర్వాత కోలుకుంది లేదు. ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.42 cr
సీడెడ్ 0.18 cr
ఆంధ్ర(టోటల్) 0.40 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.00 cr

‘శబ్దం’ (Sabdham) సినిమాకి తెలుగులో రూ.1.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా కేవలం రూ.1.0 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.60 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.50 కోట్ల దూరంలో ఆగిపోయింది ఈ సినిమా. దీంతో ప్లాప్ లిస్ట్ లోకి చేరిపోయినట్టు అయ్యింది.

సల్మాన్ దెబ్బకు బాలీవుడ్ లో మళ్లీ టెన్షన్ టెన్షన్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus