దీపావళి పండగ వేళ ప్రముఖ నటుడు రాజశేఖర్ ఇంట్లో విషాదం చోటు చేసుకంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స పొందుతున్న వరదరాజన్ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో రాజశేఖర్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
వరదరాజన్ చనిపోయారన్న విషయం తెలుసుకొని పలువురు సినీ ప్రముఖులు రాజశేఖర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరదరాజన్ గోపాల్ గతంలో చెన్నై డీసీపీగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాజశేఖర్ ఆయనకు రెండో సంతానం. వరదరాజన్ భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం చెన్నై తీసుకెళ్లారు.
వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!
Comments